
కృష్ణా జిల్లా గుడివాడలో ఈ రోజు పోలిసు కానిస్టేబుల్ ఎంత దురుసుగాప్రవర్తిస్తున్నాడో ఇక్కడ చూడవచ్చు. పట్టణంలోని ఒవర్ బ్రిడ్జ్ దగ్గర ఒక బార్లో మద్యం సేవిస్తున్నా యువకులను బయటకు లాక్కొచ్చి ఇలా చితక బాదాడు. కొంత మంది యువకులు మద్యం సేవించేటప్పడు గ్లాసు పగలింది. అంతే, బార్ యజమానికి కోపం వచ్చింది. కానిస్టేబుల్ మహేష్ ని రంగంలోకి తీసుకువచ్చాడు. యువకులను ఇలా చితక బాదించాడు.