తప్పదు... డిజిటల్ లావాదేవీలే గతి

Published : Dec 13, 2016, 04:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
తప్పదు... డిజిటల్ లావాదేవీలే  గతి

సారాంశం

ప్రభుత్వాల ధోరణి చూస్తుంటే సామాన్యులను మాత్రమే డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించాలన్నట్లు కనబడుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను బలవంతంగా డిజిటల్ లావాదేవీల వైపు నెడుతున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్రం ప్రజావసరాలకు సరిపడా డబ్బును అందుబాటులో ఉంచటం లేదన్న విషయం అర్ధమైపోతోంది.

 

దాంతో ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటిఎం ల వద్ద బారులు తీరిన క్యూలు కనబడుతున్నాయి. అవసరాలు ఓ వైపు, చేతిలో డబ్బు లేకపోవటం మరోవైపు ప్రజలను అతలాకుతలం చేసేస్తున్నాయి.

 

దాంతో ప్రజలకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. దాంతో వేరే దారి లేక ప్రజలు కూడా మెల్లిగా డిజిటల్ లావాదేవీల వైపు అడుగులు వేస్తున్నారు. డబ్బు చెలామణికి కృత్రిమ కొరత సృష్టించటం ద్వారా డిజిటల్ లావాదేవీలను పెంచాలన్నది ప్రభుత్వాల ఉద్దేశ్యంగా కనబడుతోంది. అందుకనే జనాలు కూడా ప్రభుత్వాలపై మండిపడుతున్నారు.

 

డిజిటల్ లావాదేవీలు పెంచాలని ప్రభుత్వాలనుకుంటే సరిపోదు కదా. ప్రజలకు కూడా ఆ విషయంలో ఆసక్తి ఉండాలి. ప్రజల్లో చైతన్యం తేవాలి. ప్రోత్సాహకాలివ్వాలి. అప్పుడే డిజిటల్ లావాదేవీలపై జనాలు కూడా దృష్టి పెడతారు.

 

అయితే, మన దేశంలో అక్షరాస్యత ఎంత అనేది ప్రధానం. బాగా అభివృద్ధి చెందిన, సంపూర్ణ అక్షరాస్యత ఉన్న దేశాల్లోనే నూరుశాతం డిజిటల్ లావాదేవీలు జరగటం లేదు. అలాంటిది మన దేశంలో డిజిటల్ లావాదేవీలపై ప్రభుత్వాలు మోజు పడినంత మాత్రాన ఉపయోగం ఏమీ ఉండదు. పైగా మనదేశంలో డిజిటల్ మోసాలు కూడా బాగా ఎక్కువే.

 

అవసరానికి కూడా సరిపడినంత డబ్బు చేతుల్లో లేక ప్రజలు నానా అవస్తులు పడుతున్నారు. మరోవైపు కుబేరులకు మాత్రం కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ నోట్ల కట్టలు ఏ విధంగా చేరుతున్నాయో అర్ధం కావటం లేదు.

 

చెన్నైలోని శేఖర్ రెడ్డి కావచ్చు, ఢిల్లీలోని న్యాయవాది కావచ్చు, ముంబై, బెంగుళూరులోని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కావచ్చు లేదా వివిధ రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కావచ్చు. వారందరికీ కోట్ల కొద్దీ డబ్బు ఎలా లభిస్తోందన్నది పెద్ద ప్రశ్న. ఇటువంటివి చూస్తున్న జనాలు ప్రభుత్వాలపై మండుతున్నారు.

 

అంటే, ప్రభుత్వాల ధోరణి చూస్తుంటే సామాన్యులను మాత్రమే డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించాలన్నట్లు కనబడుతోంది. ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు చేపట్టే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదని గతంలో ఎన్నోమార్లు రుజవైంది.

 

ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాతైనా డిజిటల్ లావాదేవీలు ఓ విఫల ప్రయోగంగా నిలిచిపోతుంది. కాకపోతే నలిగిపోయేది మాత్రం సామాన్య జనాలే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !