తెలుగు రాష్ట్ర ప్రజలకు గూగుల్ బంపర్ ఆఫర్

First Published Mar 15, 2018, 11:28 AM IST
Highlights
  • ఇక తెలుగులో దారి చూపించనున్న గూగుల్ మ్యాప్స్

ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ సంస్థ.. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇక నుంచి తెలుగు భాషలోనే గూగుల్ దారి చూపించనుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. గూగుల్ మ్యాప్స్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రస్తుత కాలంలో ఎక్కడికి వెళ్లాలి అన్నా.. అందరూ గూగుల్ మ్యాప్స్ సహాయంతోనే వెళుతున్నారు.  ఎంత తెలియని ప్రాంతమైన పర్లేదు.. గూగుల్ మ్యాప్స్ ఉందనే ధైర్యం చాలా మందిలో ఉంది. అయితే.. దీనిలో.. అడ్రస్, నావిగేషన్ మనకు ఇంగ్లీష్ భాషలోనే వచ్చేది. కాగా.. ఇక నుంచి తెలుగు భాషలో కూడా వస్తుంది. కేవలం  తెలుగు మాత్రమే కాదు.. బెంగాలీ, గుజరాత్, కన్నడ, తమిళం, మళయాళం భాషల్లో నావిగేషన్ సేవలను అందిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

 అంతేకాకుండా గూగుల్ మ్యాప్స్.. యూజర్ల కోసం మరిన్ని ఫీచర్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ మ్యాప్స్ యాప్ కొత్త వెర్షన్‌లో ప్లస్ కోడ్స్ పేరిట ఓ నూతన ఫీచర్ ఇప్పుడు యూజర్లకు లభిస్తోంది. మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ఏదైనా లొకేషన్‌లో యూజర్ ఉన్నప్పుడు మ్యాప్స్‌ లో సదరు లొకేషన్‌పై టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేయాలి. దీంతో అక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. దాంతోపాటే కింద యూజర్ ఉన్న ఆ ప్రదేశం గురించిన సమాచారం వస్తుంది. అలాగే అడ్రస్‌లను వెదికేందుకు ఈ కొత్త వెర్షన్‌లో స్మార్ట్ అడ్రస్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక యూజర్లు మ్యాప్స్ యాప్‌లో ఏదైనా అడ్రస్ తప్పుగా ఉందనుకున్నా, మిస్ అయింది అనుకున్నా దాన్ని ఎడిట్ చేసే వీలు కూడా కల్పించారు. 

click me!