దారుణంగా మోసపోయిన ద్రవిడ్, సైనా నెహ్వాల్

First Published Mar 15, 2018, 10:40 AM IST
Highlights
  • ప్రైవేటు కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన ద్రవిడ్, సైనా

ఓ  ప్రైవేటు కంపెనీలో పెట్టుబడులు పెట్టి టీం ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లు దారుణంగా మోసపోయారు. వీళ్లలాగానే.. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన విక్రమ్ ఇన్వెస్టిమెంట్ అనే కంపెనీలో 1776మంది భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇలా పెట్టుబడులు పెట్టిన వారిలో.. క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ భార్య విజేత, అతని సోదరుడు విజయ్, విజయ్  భార్య భావన రూ.35కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక సైనా నెహ్వాల్ 1.5కోట్లు పెట్టుబడి పెట్టగా.. ఇప్పటి వరకు ఆమెకు రూ.75లక్షలు మాత్రమే అందినట్లు సమాచారం. పెట్టిన పెట్టుబడులకు మించిన ఆదాయం వస్తుందని కంపెనీ నమ్మించడంతో వీరంతా అందులో పెట్టుబడులు పెట్టారు.

కాగా.. ఇటీవలే ఈ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాలాజీ అనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. ఇదే కంపెనీలో సైనా,ద్రవిడ్ లు పెట్టుబడులు పెట్టినట్లు తేలింది.

click me!