బ్యాంకు ఖాతాదారులను శుభవార్త

First Published Apr 15, 2017, 11:00 AM IST
Highlights

మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన సడలింపు

అడ్డమైన రూల్స్ తో ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఎస్ బీఐ ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కస్టమర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నెమ్మదిగా వెనక్కు తగ్గుతోంది. గతంలో పరిమితికి మించి ట్రాన్స్సాక్షన్ చేస్తే ఫైన్ వేస్తామంటూ షాక్ ఇచ్చిన ఎస్ బీఐ ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఇప్పుడు తాజాగా మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనపైనా వెనక్కి తగ్గింది.

 

బ్యాంకు కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ మేయిన్ టేయిన్ చేయకపోతే జరిమానా విధిస్తున్నట్లు గతంలో ప్రకటించిన ఎస్ బీ ఐ ఇప్పుడు ఆ నిబంధనను సడలించింది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సంబంధించిన పలు అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది.అలాగే, వేతన అకౌంట్లకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

click me!