‘హలో’ అంటున్న జియో

Published : Dec 18, 2017, 04:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
‘హలో’ అంటున్న జియో

సారాంశం

‘హలో జియో’ పేరిట వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్.. ఇప్పటికే జియో ఫోన్ వాడుతున్న వారికి అందుబాటులో ఉంది. కాగా.. తాజాగా జియో సిమ్ వాడుతున్న వారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తోంది.

జియో వినియోగదారులకు శుభవార్త. జియో సిమ్ వినియోగదారులకు ఆ కంపెనీ.. కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘హలో జియో’ పేరిట వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్.. ఇప్పటికే జియో ఫోన్ వాడుతున్న వారికి అందుబాటులో ఉంది. కాగా.. తాజాగా జియో సిమ్ వాడుతున్న వారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తోంది. కాకపోతే ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.

ప్రస్తుతం ఈ వాయిస్ అసిస్టెంట్ హిందీ, ఇంగ్లీష్ భాషలను మాత్రమే సపోర్ట్ చేస్తోంది. త్వరలోనే ఇతర రీజనల్ లాంగ్వేజీలలో సపోర్ట్ చేసేలా అప్ డేట్ చేయనున్నారు. జియో యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత జియో యాప్స్ పక్కనే కొత్తగా ఓ మైక్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు, హల్లో జియో వాయిస్ అసిస్టెంట్‌లోకి వెళ్లిపోవచ్చు. మైజియో అప్లికేషన్లలో మీకు ఇది కనిపిస్తుంది.

ఈ ‘హలో జియో’ ని ఉపయోగించి.. మీరు  రోజుకి ఎన్ని ఎస్ఎంఎస్ లు పంపించారు, మీ డేటా బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇలాంటి అన్ని ప్రశ్నలు మీరు అడగవచ్చు. జియోకి సంబంధించిన ఎలాంటి ప్రశ్న అడిగినా మీకు వెంటనే సమాధానం వస్తుంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu