
అటెన్షన్ ఛీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు.
ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండున్నరేళ్లలో నాలుగు కాదు, అయిదు మహా కార్య క్రమాలు జరిగాయి, రెండు పుష్కరాలు, రెండు సిఐఐ సదస్సులు, ఒక జాతీయ మహిళా పార్లమెంటు ( పార్లమెంటుతో దీనికేమీ సంబంధం లేదు): ఇవన్నీ అంతర్జాతీయ వార్తలయ్యాయి. ముఖ్యమంత్రిని ప్రతిసారి దావోస్ రమ్మంటారు. అయినా సరే అమెజాన్ అమరావతి వైపు కన్నెత్తి చూడటం లేదు.
అంతేకాదు, ఈ అమెజాన్ కు ఎక్కడో దూరాన సౌత్ లో కొయంబత్తూరు కనిపించింది, పైన ఢిల్లీలో ఉన్న నోయిడా కనిపించింది గాని, ‘వర్ ల్డ్ క్లాస్’ క్యాపిటల్ అమరావతి కనిపించకపోవడం ఆశ్యర్యం.
ఇది టూ మచ్.. వారం రోజుల కిందట ‘యాపిల్ ’ వాళ్లు కూడా బెంగుళూరు కెళ్లి పోయి, అక్కడే భారీ ఐఫోన్ తయారీ యూనిట్ పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం పెట్టుకున్నారు.
అమెజాన్ డెవెలప్ మెంటు సెంటర్ తమిళనాడు లోని కొయంబత్తూరు, ఢిల్లీని అనుకుని ఉన్ననోయిడా లో రెండు భారీ కస్టమర్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటుచేస్తుంది. ఇందులో కొయంబత్తూరు సెంటర్ ఏప్రిల్ లో, నోయిడాది జూన్ లో మొదలవుతాయి.
ఈ రెండిండిలో వందలాది మంది తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ యువకులకు ఉద్యోగాలు దొరకుతాయని అమెజాన్ అధికారులు ప్రకటించారు.
“ ఈ రెండు కొత్త కస్టమర్ సర్వీస్ సెంటర్లు మెరుగయిన సేవలందించే విధంగా అమెజాన్ ను బలపరుస్తాయి. దీనితో అమెజాన్ కస్టమర్లకు హైలెవెల్ సేవలందించేందుకు వీలవుతుంది,”అని అమెజాన్,హ్యూమన్ రిసోర్సెస్ డైరెక్టర్, రాజ్ రాఘవన్ అన్నారు.
ఈ రెండు సెంటర్లనుంచి వందల కొద్ది ఉద్యోగాలు ఈ రెండు రాష్ట్రాలకు దొరకుతాయని కూడా ఆయన చెప్పారు.
దీనితో భారత్ లో అమెజాన్ సెంటర్లు అయిదుకు చేరుకుంటాయి. ఇందులో రెండు హైదరాబాద్ లో ఉన్నాయి. వీటిని 2005 లో 2014లో ఒకటి నెలకొల్పారు. మూడో ది పుణేలో ఉంది. ఇపుడు కొయంబత్తూరులో రాబోయేది సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పిఐ) తో కలసి అమెజాన్ పనిచేస్తుంది. బిపివొ ప్రమోషన్ ఈ సెంటర్ ఉద్దేశం.
ఈ రెండు కేంద్రాలకు ఉద్యోగుల నియమాకం ఒక వారం రోజుల్లో మొదలవుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
మరి నాయుడిగారి పలుకుబడి ఏమయిందో?
.