నిన్న తగ్గింది.. ఈరోజు పెరిగింది

First Published Feb 9, 2018, 5:49 PM IST
Highlights
  • మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

 రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.220 పెరిగి రూ.31,170కి చేరింది.  గురువారం రూ.600 తగ్గిన బంగారం ధర.. శుక్రవారం రూ.220 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ కాస్త పెరిగిందని..అందుకే పసిడి ధర కూడా పెరిగిందని  బులియన్‌ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా కాస్త పెరిగింది. కిలో రూ.330 పెరగడం ద్వారా రూ.39,230కి చేరింది. పెళ్లిళ్ల సీజన్, ఓవర్సీస్‌లో డిమాండ్‌ వెండి ధర పెరుగుదలకు కారణమైంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.02శాతం పెరిగి 1,318.30డాలర్లకు చేరింది.

click me!