మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర

First Published Feb 15, 2018, 5:15 PM IST
Highlights
  • రూ.350 పెరిగిన బంగారం ధర
  • రూ.720 పెరిగిన వెండి

బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి. మూఢాలు పోయి.. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో పసిడి ధర అమాంతం పెరిగిపోయింది.  గురువారం రూ.350 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,650కి చేరింది. డాలర్‌ విలువ పడిపోవడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఉండటంతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి భారీగా డిమాండ్‌ పెరిగింది. ఈ కారణాల వల్ల పసిడి ధర అమాంతం పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

 

వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర రూ.720 పెరిగింది. దీంతో కిలో వెండి రూ.39,970కి చేరింది. ఇక అంతర్జాతీయంగా పసిడి ధర 0.27శాతం పెరగడంతో ఔన్సు 1,354 డాలర్లు పలికింది. వెండి ధర కూడా 0.48శాతం పెరగడంతో ఔన్సు 16.92డాలర్లు పలికింది.

click me!