
దేశీయంగా బంగారానికి డిమాండ్ రోజురోజుకూ తగ్గుతోంది. ఈ రోజు 10 గ్రాముల బంగారానికి రూ. 100 తగ్గింది.
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.28,450 గా ఉంది. భవిష్యత్తులో మరింత భారీగా ధర తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
కానీ, ఆశ్చర్యకరంగా వెండి ధర మాత్రం వంద రూపాయలు పెరిగింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.41,500 గా ఉంది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం బంగారం పై విధించిన ఆంక్షలు, అలాగే ఎక్కడ డబ్బులు చేతికి దొరకని సమస్యల మూలంగా ఇలా బంగారం ధర బాగా తగ్గినట్లు తెలుస్తోంది.