అక్కడ జాతీయగీతం ఎందుకు : అరవింద్ స్వామి

First Published Dec 13, 2016, 8:32 AM IST
Highlights

రోజూ లాంటి దేశభక్తి సినిమా చేసిన అరవింద్ స్వామి జాతీయ గీతంపై ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రోజూ సినిమా... దేశభక్తి ని ఒక కొత్త కోణంలో చూపించిన మణిరత్నం హిట్ మూవీ. ఇందులో హీరోగా నటించిన అరవింద్ స్వామి రాత్రికిరాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు.

 

అలాంటి మూవీలో నటించిన అరవింద్ స్వామి ఇప్పుడు థియేటర్ లలో జాతీయగీతం పాడాలన్న కోర్టు నిర్ణయంపై ఎవరూ అనుకోని రీతిలో స్పందించారు.

 

థియేటర్లలో జనగనమణ పాడటంపై అరవింద్‌ స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

 

జాతీయస్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలప్పుడు జాతీయ గీతం పాడితే అర్థం ఉంది. కానీ, థియేటర్లలో పాడడం అర్థంలేని పని అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందని సూచించాడు.

click me!