మార్కెట్లో నేటి బంగారం ధరలు

First Published Dec 12, 2017, 10:49 AM IST
Highlights
  • పదిగ్రాముల బంగారం ధర రూ.27,220
  • కేజీ వెండి ధర రూ.40,220

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర శనివారం అనూహ్యంగా పెరిగిపోయాయి. కాగా.. మంగళవారం తిరిగి తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ 11న రూ.27,370గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.150 తగ్గి రూ.27,220కి చేరింది. మరోవైపు గత ఐదు రోజులుగా వెండి ధరలో ఎలాంటి మార్పులేదు.

హైదరాబాద్ నగరంలో 22క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.27,220గా ఉండగా, 24క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.29,694గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.27,220గా ఉండగా, 24 క్యారెట్స్ పది గ్రాముల పసిడి ధర రూ.29,694గా ఉంది. విశాఖపట్నంలో 22క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.27,370 కాగా, 24 క్యారెట్స్ పదిగ్రాముల పసిడి ధర రూ.29,694గా ఉంది.

హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ధర రూ.40,200, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.40,200, విజయవాడలో కేజీ వెండి ధర రూ.40,200గా ఉంది.

click me!