స్వల్పంగా పెరిగిన బంగారం ధర

First Published Jan 20, 2018, 4:43 PM IST
Highlights
  • తులం బంగారం ధర రూ.30,850
  • కేజీ వెండి ధర రూ.39,900

బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం.. నేడు కాస్త కోలుకుంది. రూ.20 పెరిగి తులం బంగారం ధర రూ.30,850కి చేరింది. శుక్రవారం నాటి బులియన్ మార్కెట్ లో పసిడి ధర రూ.120 తగ్గిన సంగతి తెలిసిందే. నేటి మార్కెట్ లో వెండి ధర కూడా బంగారం బాట పట్టింది. రూ.50 పెరిగి కేజీ వెండి ధర రూ.39,900కి చేరింది. దేశీయ మార్కెట్ లో బంగారం కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడంతో పసిడి ధర స్వల్పంగా పెరిగనట్టు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.  గడిచిన రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ.270 తగ్గగా.. శనివారం రూ.20 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్ లో 0.32శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1330 డాలర్లకు చేరింది. 0.38శాతం పెరిగి ఔన్సు వెండి ధర 17డాలర్లకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.30,850 ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల పసిడి ధర రూ.30,700కి చేరింది.

click me!