ప్రజా సమస్యల పరిష్కారానికి కదిలిన ఉక్కు దండు

First Published Jan 29, 2018, 4:18 PM IST
Highlights

ప్రజాసమస్యల పరిష్కారంలో కూడా స్టీల్ ప్లాంట్ సాధన సమితి ముందుంటుంది

ఉక్కు ఫ్యాక్టరీ కోసం  పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఇపుడు తన ఉద్యమాన్ని ఇతర సమస్యల వైపు కూడా మళ్లించాలని చూస్తున్నది. రెండేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ ఉద్యమానికి  కడప జిల్లా ప్రజలనుంచి, ముఖ్యంగా ప్రొద్దుటూరు, పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

అందువల్ల ఉద్యమంలో ఉక్కుసాధన ఉద్యమంలో  భాగస్వాములవుతున్న ప్రజలకు ఉన్నసమస్యల మీద కూడా పోరాడి వాటి పరిష్కారానికి తమ సంస్థ కృషి చేస్తుందని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. పేదల కోసం నేనున్నానంటూ తమ సంస్థ  జనంలోకి వెళ్లుతుందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా  ఈ రోజు స్థానిక వాజ్ పేయి నగర్ కు చెందిన బడుగు వర్గాల కోసం అండగా ప్రవీణ్  నిలబడ్డారు. వారి ఇళ్లను తొలిగించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు.  

 దాదాపు పదేళ్లుగా ఇక్కడ ఈ ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే, ఈ  పేదల ఇళ్లను తొలగించడానికి అధికార యంత్రాంగం సిద్ధమయింది. దీంతో భయపడిపోయిన వాజ్ పేయి నగర వాసులు ప్రవీణ్ ను, స్టీల్ ప్లాంట్ సాధన సమితిని  ఆశ్రయించారు. దీంతో బడుగులతో కలిసి ప్రవీణ్ స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఇవాళ ధర్నా నిర్వహించారు. ఆశ్రయం పొందుతున్న నిరుపేదలకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. పేదలకు అన్యాయం చేయాలని తలపిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానని ఉక్కు ప్రవీణ్ స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు

click me!