‘చిల్లర’ దేవుళ్లు

First Published Nov 21, 2016, 12:00 PM IST
Highlights
  • జనాల కష్టాలు తీర్చనున్న హుండీలు
  • ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆలయ కమిటీలు
  • బ్యాంకులకు చిల్లర నోట్ల సరఫరాకు సిద్ధం

 

ఎప్పుడైతే జనం ఆపదలో ఉంటారో... అప్పుడు దేవుడు ఏదో రూపంలో భూమిపైకి వచ్చి ఆదుకుంటాడు.. భగవద్గీత నుంచి ప్రతి హిందూ పురాణంలో మనం చదువుకున్నదే ఇది..

 

ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు  దెబ్బకు కష్టాల్లో ఉన్న జనాన్ని ఆదుకునేందుకు దేవుడు మళ్లీ వచ్చాడు... జనాల చిల్లర కష్టాలను తీర్చడానికి హుండీ రూపంలో కొలువుదీరాడు.

 

పెద్ద నోట్లు నాకు సమర్పించి హుండీలలో ఉన్న చిల్లరను తీసుకోండి... మీ కష్టాలు తీర్చుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

ఇంతకీ అసలు విషయానికి వస్తే...

 

500, 1000 నోట్లు రద్దు నేపథ్యంలో చిల్లర దొరక్క బడాబాబులే నానా కష్టాలు పడుతున్నాడు... ఇక సమాన్యులకు రోజు గడవడటమే కష్టంగా ఉంది.

 

నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ బయటపడుతుందో లేదో తెలియదు కానీ, జనాలు మాత్రం రోడ్డున పడ్డారు. దీంతో చిల్లర సమస్య తీర్చడంపై అధికారులు దృష్టి సారించారు.

 

దేశంలోని వివిధ ఆలయాల్లోని హుండీలను తెరిచి చిల్లర సమస్య తీర్చాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. హుండీల్లో పేరుకుపోయిన చిల్లరను తెచ్చి బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సూచించింది.

 

దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ఉన్న హుండీల్లో ఉన్న చిల్లర గనుక బ్యాంకులకు చేరితే.. ఇక చిల్లర సమస్యే ఉండదు. ఎంతైనా దేవుడు... దేవుడే..

click me!