రెండు నెలల గరిష్ఠానికి బంగారం ధర

First Published Aug 10, 2017, 5:34 PM IST
Highlights
  • పది గ్రాముల బంగారం రూ.29,890
  • కిలో వెండి రూ.40,070

 

బంగారం ధర రెండు నెలల గరిష్ఠానికి చేరింది. గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం పెరిగింది. రూ.340 పెరిగి, పది గ్రాముల బంగారం రూ.29,890కి చేరింది. స్థానికంగా ఆభరణాల తయారీదారుల నుంచి భారీగా కొనుగోళ్లు వూపందుకోవడం, పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో పసిడి ధర పుంజుకున్నట్లు బులియన్‌ ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి.

నేడు వెండి ధర కూడా పెరిగింది. వెండి ధర కిలో రూ.40వేల మార్కును చేరుకుంది. రూ.570 పెరగడంతో కిలో వెండి రూ.40,070గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ రావడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

 

click me!