బాబోయ్... ఈ సీరియల్ ఆపండి..

First Published Aug 10, 2017, 5:09 PM IST
Highlights
  • సీరియల్ ప్రసారాన్ని నిలిపివేయాలంటూ కొన్ని లక్షల మంది ఆందోళన చేస్తున్నారు.
  • వారి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి

 

కొత్తగా వచ్చిన సినిమా.. ఒక రోజులో చూసి వదిలేస్తారు. కానీ సీరియల్స్ అలా కాదు. సంవత్సరాల పాటు సాగుతూనే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు సాగదీస్తూ తీసినా చాలా మంది వాటిని చూడటం మాత్రం మానరు. అంతలా సీరియల్స్ ని ప్రజలు నీరాజనం పలుకుతూ వస్తున్నారు. అలాంటిది ఎప్పుడూ లేనిది ఓ సీరియల్ ప్రసారాన్ని నిలిపివేయాలంటూ కొన్ని లక్షల మంది ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సీరియల్ రాని వ్యతిరేకత  ఈ సీరియల్ కి ఎదురైంది. వివరాల్లోకి వెళితే...

సోనీటీవీలో ఇటీవల పెహ్రేదార్ కీ పియా అనే సీరియల్  ప్రారంభమైంది. ఆ సీరియల్ లో కథానాయకుడు పదేళ్ల పిల్లాడు. హీరోయిన్ వచ్చి 18ఏళ్ల యువతి. ఆ పదేళ్ల పిల్లాడు.. యువతిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు.

వారి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆ పిల్లవాడు.. ఆమె నుదిటిపై కుంకుమ దిద్దటం లాంటి సన్నివేశాలు ఉన్నాయి. పెళ్లి అంటే అర్థం కూడా తెలియని పిల్లవాడు ఓ యువతి ప్రేమ వివాహం చేసుకోవడం పట్ల  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఆ సీరియల్ చూసి ఇంట్లో పిల్లలు కూడా తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సీరియల్ ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి విన్నపం చేశారు. దీనిపై ఆన్ లైన్ పిటిషన్ వేస్తే  లక్ష మందికి పైగా సీరియల్ బ్యాన్ చేయాలని కోరడం గమనార్హం

కాగా దీనిపై ఆ సీరియల్ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్న తేజశ్వీ ప్రకాశ్ దీనిపై స్పందించారు. దీనిని ప్రొగ్రెసివ్ షోగా ఆమె అభివర్ణించారు. ప్రజలు.. పుస్తకంపై ఉన్న కవర్ ని చూసి పుస్తకాన్ని అంచనా వేస్తున్నారని ఆమె అన్నారు. అంతే కాకుండా ఈ పెహ్రేదార్ కీ పియా సీరియల్ ని గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ తో పోల్చి మాట్లాడారు. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ లో ఏది చూపించినా చూస్తారు.. అదే విషయాన్ని పెహ్రేదార్ కీ పియా లో చూపిస్తే చూడరా అంటూ ప్రశ్నించారు. అది కేవలం ఒక కథ.. ఫిక్షన్.. వాటిని మేము ప్రజలకు చెప్పాలనుకున్నాం.నచ్చితే చూడండి..లేక పోతే మానేయండి అంటూ ఆమె ఘాటుగానే స్పందించారు.

click me!