
చేవెళ్ల మండలం ఇక్కారెడ్డి గూడలో 18 నెలల చిన్నారి బోరు బావిలో పడింది.
తల్లి పనిచేస్తున్న సమయంలో ఆడకుంటూన్న చిన్నారి అటుఇటు తిరుగుతూ బోరుబావిలోకి పడిపోయింది.
ఈ విషయం తెలియగానే రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి.ఘటనా స్థలానికి హటాహూటీన చేరుకున్నారు.
పాపను రక్షించేందుకు సహాయక చర్యల్లో మంత్రి మహేందర్ రెడ్డి స్వయంగా పాల్గొంటున్నారు.
పాప ప్రాణాలు కాపాడాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పాప అరవై అడుగల లోతులో ఉందని గుర్తించారు.
బోర్ బావులలో పిల్లలు పడిపోయి చనిపోతూండటం ఎపుడూ జరుగుతూ ఉన్న, బోర్ లు పూడ్చడం మీద ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.
బోర్లను తప్పని సరిగా పూడ్చాలనే నియమం లేదు.
ఉన్నా అమలుచేస్తున్నట్లు ఎక్కడా దాఖలా లేదు.
బోర్లు ఫెయిలయినపుడు బోర్ ని పూడ్చని యాజమాన్యం మీద లేదా భూయజమాని మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కాదు.