వైసిపి కి షాక్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఔట్

First Published Nov 26, 2017, 12:46 PM IST
Highlights

రేపు టిడిపి చేరుతున్నట్లు ప్రకటించారు.

రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ లోనుంచి ఎమ్మెల్యేలు  ఒక్కొక్కరే  రూలింగ్ తెలుగుదేశంలోకి వెళుతున్నారు.

ఇపుడు పాడేరు గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాష్ట్రాభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ది   కోసం తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయిస్తున్నారు.

సోమవారం నాడు ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పచ్చ కండువా కప్పుకుంటారు. ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించారు. విశాఖ జిల్లా, పాడేరు నియోజకవర్గం, అభివృద్ధికోసం , కార్యకర్తల అభిమానుల అభీష్టం మేరుకు తానీ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె విలేకరులకు తెలిపారు. జగన్ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్న తనలాంటి వారికి వైసిసిలో గుర్తింపు లేదని, తనను సైడ్ లైన్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి విధానాల వల్ల తాను  పార్టీ మారాల్సి వస్తున్నదని ఆమె ఆరోపించారు. ఇది ఇలా ఉంటే, ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు టిడిపి కూడా ఏర్పాట్లు మొదలుపెట్టిండి. గిరిజన నాయకులు మాజీ మంత్రి ఎం మణికుమారి,  ఎస్టీసెల్ విశాఖ అధ్యక్షుడు బొర్రా నాగరాజు, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎం వివిఎస్ ప్రసాద్ లను అమరావతి పిలిపిస్తున్నారు. 27న ఈశ్వరి మొదట  గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబుతో సమావేవమవుతారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ల సమక్షంలో ఆమె టిడిపిలో చేరతారు.

click me!