రూ.20కే 1జీబీ డేటా

First Published Nov 21, 2017, 4:03 PM IST
Highlights
  •  టెలికాం రంగంలో ‘జియో’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
  • జియో దెబ్బకి ఇతర నెటవర్క్ లు దాదాపు కుదేలు అయ్యాయి

 టెలికాం రంగంలో ‘జియో’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జియో దెబ్బకి ఇతర నెటవర్క్ లు దాదాపు కుదేలు అయ్యాయి. అతి తక్కువ ధరకే 4జీ వేగంతో డేటాను అందించేందుకు రిలయన్స్‌  ‘ జియో’ సిమ్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జియో తాకిడిని తట్టుకునేందుకు ఇతర నెట్ వర్క్స్ కూడా భారీ ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీ జియోకే షాక్ ఇస్తోంది. కేవలం రూ.2కే 100 ఎంబీ డేటాను అందించేందుకు సిద్ధమైంది. అదే  బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ వైఫై డబ్బా.

అసలు విషయం ఏమిటంటే  వైఫై డబ్బాను 13 నెలల క్రితం బెంగళూరులో ప్రారంభించారు. వినియోగదారులకు చౌక ధరకే డేటాను అందించే లక్ష్యంగా ఈ కంపెనీ పనిచేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ రూ.2కే 100 ఎంబీ, రూ.10కి 500 ఎంబీ, రూ.20కి 1జీబీ చొప్పున టారిఫ్‌లు వసూలు చేస్తోంది. 24 గంటల వ్యాలిడిటీతో ఈ ఆఫర్లు అందిస్తోంది. అయితే ఇందుకోసం ఎలాంటి యాప్‌లు, డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదట. ప్రీపెయిడ్‌ టోకెన్ల ద్వారా ఈ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఈ సంస్థ. మొబైల్‌ నంబర్‌ను ఓటీపీ ద్వారా వెరిఫై చేసి తర్వాత డేటాను ఇస్తుంది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో రూటర్లు ఏర్పాటుచేసింది.

‘ప్రస్తుతం భారత్‌లో డేటా ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. జియో వచ్చినా, ఈ టారిఫ్‌ల బాధ తప్పట్లేదు. అందుకే మేం ఈ సంస్థ ప్రారంభించాం’ అంటున్నారు వైఫై డబ్బా వ్యవస్థాపకులు. త్వరలోనే ఈ వైఫై డబ్బాను దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు.

click me!