స్టాలిన్ అంతిమయాత్ర అరుదైన కలర్ వీడియో ఇదే

Published : Mar 17, 2017, 07:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
స్టాలిన్ అంతిమయాత్ర అరుదైన కలర్ వీడియో ఇదే

సారాంశం

 1953 మార్చి 9 న  మాస్కో రెడ్ స్క్వేర్  లోని  అమెరికన్ ఎంబసీ కిటికి  నుంచి రహస్యంగా దీనిని చిత్రీకరించారు  

 

 

సోవియట్ రష్యాకు, కమ్యూనిస్టు పార్టీకి 31 సంవత్సరాలు నాయకత్వం వహించిన  జోసెఫ్ స్టాలిన్  మార్చి 5,1953లో 74 వ యేట చనిపోయాడు. ఆయన్ని బయటి ప్రపంచం  ఒకనియంతగా చూస్తున్నాయి. చాలాకాలం  సోవియట్ రష్యాకూడా  ఆయన పేరెత్తకుండా గడిపింది. ఇపుడు రష్యా మళ్లీ మెల్లిగా స్టాలిన్ వైపు అడుగేస్తూఉంది.   1936-38  మధ్య ఆయన లక్షాలాది మంది కమ్యూనిస్టు ‘ద్రోహు’లను లేపేయించాడనిచెబుతారు. స్టాలిన్ విషపు చూపు పడని కుటుంబమే రష్యా లో లేదని పాశ్యాత్య పండితులు చెబుతుంటారు. అయితే, నాజీ జర్మనీ మీద ఆయన సాధించిన అఖండ విజయం వీటన్నింటిని చెరిపేసింది.

 

ఆయన అనారోగ్యం గురించి ఎపుడూ వినని సోవియట్ ప్రజలకు, గుండెపోటుతో స్టాలిన్ చనిపోయాడనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది.

 

స్టాలిన్ అంతిమ యాత్ర 1953 మార్చి 9 నజరిగింది. దీనికి సంబంధించి ఇంతవరకు నాటి సోవియట్ ప్రభుత్వం అందించిన ఫోటోలు, బాగా ఎడిట్ చేసిన వీడియోలు మాత్రమే  ఉన్నాయి. అయితే, ఇపుడు అమెరికా దౌత్యాధికారి ఒకరు తీసిన కలర్ ఫుటేజి బయటపడింది.

ఈ అంతిమ యాత్ర ను రెడ్ స్క్వే ర్ లోని అమెరికా దౌత్య కార్యాలయం కిటీకిలో నుంచి చిత్రీకరించారు. సోవియట్ ప్రజలు తమనేతకు కడసారి వీడ్కోలు పలుకుతున్నప్పటీ ఈ వీడియో  ఫుటేజిని రేడియో ఫ్రీ యూరోప్ /రేడియో లిబర్టీ కొద్ది రోజులకిందట విడుదల చేసింది. స్టాలిన్ అంతిమ యాత్ర గురించి ఒక ప్రయివేటు వ్యక్తి చేసిన చిత్రీకరణ ఇదే. అమెరికా దౌత్య కార్యాలయంలో పనిచేస్తూన్న మేజర్ మార్టిన్ మాన్ హాఫ్  ఈ విడియోని చిత్రీకరించారు.

 

మాన్ హాఫ్ వీడియోవల్ల   స్టాలిన్ అంతిమ యాత్రను ఉన్నదున్నట్లు చూసేందుకు ఇపుడు వీలు కల్గింది. అమెరికా పసిఫక్ నార్త్ వెస్టు లోని ఒక గ్యారేజీలో మాన్ హాఫ్ తీసిన వేలాది ఫోటోలు(పై ఫోటో కూడా మాన్ హాఫ్ అర్కైవ్స్ లోనిదే), వీడియో డొగ్లస్ స్మిత్ అనే చరిత్ర కారుడి కంటపడ్డాయి. ఇపుడు వెలుగులోకి వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !