
విశాఖలో ఇపుడు వినిపిస్తున్నదంతా కోట్ల కోట్ల రుపాయలే.
ఎవరు ఏమ్మాట్లాడినా కోట్లే, ఎవరడిగినా కోట్లే. వస్తున్నవి కోట్లే, ఇస్తున్నవి కోట్లే.
విశాఖలో జరిగిన రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సులో మొత్తం 10.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయి.
ఇది గత ఏడాది వచ్చిన పెట్టుబడులకంటే దాదాపు డబల్.
వీటికి సంబంధించి 665 వప్పందాలమీద రాష్ట్ర ప్రభుత్వం , ఇన్వెస్టర్లు సంతకాలు చేశారు.వీటితో 22 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అంతకు ముందు ఇదే సదస్సలో మాట్లాడుతూ, రూ.లక్ష కోట్లకు పైగా విలువైన రహదారుల నిర్మాణం ఈ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిచేస్తామనికేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.విశాఖ లో జరుగుతున్న సిఐఐ పార్ట్ నర్ షిప్ సదస్సలో ప్రసంగిస్తూ విశాఖ పట్టణాన్ని, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను కేంద్ర ప్రభుత్వం ఎలా మార్చబోతున్నది వివరించారు.
ఆయన ఉన్నది విశాఖ బీచొడ్డున కాబట్టి మొదట విశాఖ గురించి చెబుతూ, ‘విశాఖపట్నం పోర్టు దేశంలో అతి పెద్ద ఓడరేవుగా వుంది.విశాఖపట్నం పోర్టు అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం,’ అన్నారు.
అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం-విజయవాడ, విజయవాడ - నెల్లూరు కోస్టల్ ఎకనామిక్ జోన్లకు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు పెడుతున్నామని కూడా చెప్పారు.బకింగ్ హమ్ కెనాల్ వాటర్ వేస్ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకున్నాం వాటిని తొందరల్లోనే అమలుచేస్తామని హామీ ఇచ్చారు.
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరలో మొదలుపెడతామని ముఖ్యమంత్రికి మాటిచ్చా. చేసిచూపిస్తానని ఆయన అన్నారు.
రాయపూర్-విశాఖ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి రూ.5 వేల కోట్లు వ్యయం కానుంది అన్నారు. ఈ రోడ్డును మలుపు లేకుండా చక్కగా ఉండేలా నిర్మించాలని అపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖ-రాయపూర్ నడుమ మలుపులు లేని 6లేన్ల రహదారి నిర్మించాలని కోరుతున్నాం, దీనికి సమాంతరంగా రైల్వే లైను కూడా ఏర్పాటు చేయాలి.
రూ.1000 కోట్ల సీఆర్ఎఫ్ (సెంట్రల్ రోడ్ ఫండ్) నిధులు మంజూరు చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకటించారు.
ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన ఇన్వెస్టర్లు ఈ సదస్సులో పెట్టుబడులుపెట్టేందుకు ఎంఒయులు సంతకాలుచేస్తున్నారు.నిన్నఒక్కరోజే రూ.లక్షా 43 వేల కోట్ల పెట్టుబడులతో గ్యాస్, పెట్రో రంగంలో ఎంవోయూలు జరిగాయి.
పోయినసారి వచ్చిన 2.81 లక్షల కోట్లకు ఎన్నిపరిశ్రమలొచ్చాయి, ఎన్ని ఉద్యోగాలొచ్చాయో ఎవరైనా చెబితే ప్రజలు సంతోషిస్తారు.