ఎస్ఎంఎస్ తో.. జియో ఫోన్ ప్రీ బుకింగ్..!

First Published Aug 17, 2017, 5:46 PM IST
Highlights

ఆగస్టు 24వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి

ఎస్ఎంఎస్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు

 

దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న రిలయన్స్ కంపెనీకి చెందిన జియో ఫోన్ వచ్చే నెలలో మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ లను  ఫస్ట కమ్ ఫస్ట్ సర్వ్ ( ముందు ఆర్డర్ చేసుకున్న వారికి ముందు అందజేయడం) విధానం ద్వారా అందజేయనున్నారు. ఆగస్టు 24వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రిలయన్స్ కంపెనీ బీటా టెస్టింగ్ చేస్తోంది.  ఈ జియో ఫోన్ టెలికాం వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రూ.1500  పెట్టి ఫోన్ కొనుగోలు చేస్తే,..  ఆ మొత్తాన్ని తిరిగి వినియోగదారుని ఖాతాలో జమచేస్తామని రిలయన్స్ కంపెనీ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ జియో ఫోన్ ని ఎస్ఎంఎస్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో కస్టమర్ కేర్ ఎగ్జిగ్యూటివ్ ఒకరు తెలిపారు. "JP<>మీ ప్రాంత పిన్ కోడ్ <>మీకు సమీపంలో ఉన్న జియో స్టోర్  కోడ్  " టైప్ చేసి 7021170211 నెంబర్ కి ఎస్ఎంఎస్ చేస్తే చాలు. మీరు రిజిస్టర్ చేసుకున్నట్టే నని ఆయన  చెప్పారు. మీకు దగ్గరలో ఉన్న జియో స్టోర్ కి వెళ్లి అడిగితే ఆ స్టోర్ కోడ్  నెంబర్ చెబుతారని.. దీంతో మీరు ఎస్ఎంఎస్ చేయవచ్చని ఆయన తెలిపారు.

జియో ఫోన్ బుక్ చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు జియో వెబ్ సైట్ కి వెళ్లి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లి "Keep me posted" అనే లింక్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు కనుక ఒక సారి రిజిస్టర్ అయితే... రిలయన్స్  కంపెనీ.. మీకు జియో ఫోన్ విషయాలను మీకు తెలియజేస్తారు. ఏదైనా మార్పులు చేర్పులు చేసినా, అభివృద్ధి తదితర సమాచారాన్ని వెంటనే తెలుసుకోవచ్చు.

ఈ జియో ఫోన్ ని కొనుగోలు చేసిన తర్వాత రూ.153తో రీఛార్జ్ చేసుకుంటే.. ఒక నెల మొత్తం అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచితంగా మొబైల్ డేటా, ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు

click me!