ఆంధ్రాలో డేంజర్ జోన్లు ఇవే...

First Published Oct 17, 2017, 11:53 AM IST
Highlights
  • ఆంధ్రప్రదేశ్ లో  డేంజర్ జోన్లుగా ఐదు  గ్రామాలు.
  • ఆ గ్రామాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి  ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఊర్లను ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. తుని నుంచి రావులపాలెం జాతీయరహదారి 16పైగల దివాన్ చెరువు, లాలా చెరువు, మోరంపూడి జంక్షన్, వేమగిరి, ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామాల్లో  రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.

దీంతో.. ఆ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మించాలని అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో.. దానిని తాజాగా కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని జాతీయ రహదారి అధికారులు, రవాణా శాఖ అధికారులకు పంపించారు.

ప్లైఓవర్ నిర్మించడానికి 19.75 ఎకరాల భూమి అవసరమౌతుంది సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దివాన్ చెరువు వద్ద 2.487కిలోమీటర్లు, లాలా చెరువు వద్ద 0.98కిలోమీటర్లు, మోరంపూడి జంక్షన్ వద్ద 0.65కిలోమీటర్లు, వేమగిరి వద్ద 1.51కిలోమీటర్లు, ఆలమూరు మండలంలోని జొన్నాడ వద్ద 1.51కిలోమీటర్ల పొడవుతో ఫ్లై ఓవర్లు నిర్మించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

భూమిని సేకరించి.. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభిస్తే.. ఈ ఫ్లై ఓవర్ పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని ఓ అధికారి తెలిపారు. ఈ  ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఎవరికి అప్పగిస్తారనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ణయించలేదు. వీటికోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన భూములను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

click me!