నవంబర్ 8 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

Published : Oct 17, 2017, 11:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
నవంబర్ 8 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదల

నవంబర్ 8 నుంచి 13వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం.. సమావేశాలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టునున్నట్లు సమాచారం. కాగా, ఈసారి వర్షాకాల, శీతాకాల సమావేశాలు కలిపి నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలవడంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనే దానిపై తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలను లేవనెత్తి సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుండగా, ప్రతిపక్షం ఎత్తులు చిత్తు చేయాలని అదికార పక్షం భావిస్తోంది.

ఈ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకావడం అనుమానమే. ఎందుకంటే  ఆయన నవంబర్ రెండో తేదీనుంచే అరునెలల పాదయాత్ర బయలుదేరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !