సోనియా ఇలాకాలో అమిత్ షా, యోగీలకు తప్పిన ప్రమాదం

Published : Apr 22, 2018, 12:13 PM ISTUpdated : Apr 22, 2018, 12:19 PM IST
సోనియా ఇలాకాలో అమిత్ షా, యోగీలకు తప్పిన ప్రమాదం

సారాంశం

ఉత్తర ప్రదేశ్ పర్యటనలో వున్న బిజెపి చీఫ్ అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ మాజీ అద్యక్షురాలు సోనియాగాంధి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పార్లమెంట్ పరిధిలో తమ పట్టును పెంచుకునేందకు బిజెపి అద్యక్షులు అమిత్ షా, సీఎం యోగితో కలిసి పర్యటించారు. అనంతరం ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే వీరు వేదికపై ఉండగానే వేదిక సమీనపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.  రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ సభ వేదికపై షా, యోగి ఉండగా మీడియా ఎన్‌క్లోజర్‌ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, బద్రతా సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నప్పటికి ఆ తర్వాత సభ సజావుగానే సాగింది.    

ఉత్తర ప్రదేశ్ పర్యటనలో వున్న బిజెపి చీఫ్ అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ మాజీ అద్యక్షురాలు సోనియాగాంధి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పార్లమెంట్ పరిధిలో తమ పట్టును పెంచుకునేందకు బిజెపి అద్యక్షులు అమిత్ షా, సీఎం యోగితో కలిసి పర్యటించారు. అనంతరం ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే వీరు వేదికపై ఉండగానే వేదిక సమీనపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 

రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ సభ వేదికపై షా, యోగి ఉండగా మీడియా ఎన్‌క్లోజర్‌ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, బద్రతా సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నప్పటికి ఆ తర్వాత సభ సజావుగానే సాగింది.
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !