వాల్యూ ఉంది..‘వాస్తు’ లేదు

Published : Nov 30, 2016, 09:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
వాల్యూ ఉంది..‘వాస్తు’ లేదు

సారాంశం

రూ. 2 వేల నోటుపై జనాల విముఖత నాసిరకం నోటు.. చిల్లర దొరకడం కష్టం

 

పుండు మీద కారం చల్లడం అంటే ఇదే అనుకుంటా.. పెద్ద నోట్లు రద్దుతో దేశమంతా గగ్గోలు పెడుతుంటే మరో పెద్ద నోటు తీసుకొచ్చి జనాల నెత్తిన రుద్దింది కేంద్ర ప్రభుత్వం.

నోట్ల రద్దు వల్ల చేతిలో ఉన్న నోట్లు కూడా చెల్లకుండా పోవడం ఒక సమస్య అయితే.. చిల్లర కొరత మరో సమస్య...  ఈ రెండు సమస్యలపై సామాన్యుడు పోరాటం మొదలుపెట్టకముందే మరో  పె....ద్ద సమస్య అతడికి ముందుకు వచ్చింది.

 

అదే 2 వేల రూపాయిల నోటు..

 

ఇప్పడు జనాలకు పెద్ద నోట్ల రద్దు కంటే రూ. 2 వేలకు చిల్లర దొరకడమే పెద్ద సమస్యగా మారిపోయింది. కావాలంటే ఎవరిదగ్గరికైనా వెళ్లి రూ. 2 వేలకు చిల్లర ఉందా.. అని అడగే సహసం చేయండి. చిల్లర ఇవ్వడం తర్వాత నీపై చిరాకుగా చూడకపోతే చాలు.

 

పైసాను పరమాత్మగా చూసే దేశం మనది.. పొరపాటున రూపాయి కింద పడ్డ కళ్లకు అద్దుకొని మరీ జేబులో వేసుకొని జనం మనం. కానీ, రూ. 2 వేలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. పాపం.. వాల్యూ ఉన్నా వాస్తు సరిగా లేకుండా పోయింది.

 

పేరుకు పెద్ద నోటు..మాకైతే వద్దు అంటున్నారు  రూ. 2 వేల నోటును చూసిన సామాన్యులు. అసలే నాసిరకంగా తయారైన నోటు.. ఆపై రకరకాల పుకార్లు... చిల్లర దొరకని సమస్య.. ఇవన్నీ రూ. 2 వేల నోటును భ్రూణహత్య చేసేస్తున్నాయి.

 

అందుకే కేంద్రం కూడా ఈ నోటు పై పునరాలోచన చేస్తోంది. త్వరలోనే రూ. 2 వేల నోటుకు కూడా దండేసి దండం పెట్టే అవకాశం స్పష్టంగానే కనిపిస్తుంది.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !