శిరచ్ఛేదానికి క్షణాల ముందు క్షమాభిక్ష

Published : Aug 19, 2017, 08:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
శిరచ్ఛేదానికి క్షణాల ముందు క్షమాభిక్ష

సారాంశం

సౌదీలో ఒకతండ్రి కొడుకు చంపిన హంతకుడికి శిరచ్ఛేదానికి కొద్ది క్షణాల ముందు క్షమా భిక్ష పెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.

సౌదీలో ఒక తండ్రి కొడుకును చంపిన హంతకుడికి ఉత్కంఠ భరితమయిన చివరి క్షణంలో క్షమాభిక్షపెట్టాడు. హంతకుడిని వద్యశిల వైపు తీసుకువెళ్లున్నపుడు ఆయనలో మనిషి మేల్కొన్నాడు. మానవత్వం ఒక్కసారిగా వేయిపూలై వికసించింది.  కొద్ది క్షణాల్లో హంతకుడికి శిరచ్ఛేదం జరగాల్సి ఉంది. ఉన్నట్లుండి పెద్ద బలగంతో ఆయన వధ్యశిల వైపు వచ్చాడు.  మరణ శిక్ష అమలుచేసేందుకు సమాయత్తమయిన అధికారులను హంతకుడిని కూడా ఇది ఆశ్చర్య పరిచింది. హంతకుడిని తాను క్షమిస్తున్నానని ప్రకటించాడు. సౌదీలో హతుడి కుటుంబ సభ్యులకు క్షమా భిక్ష అర్హత ఉంది.

 ఈ సంఘటన సౌదీ అరేబియా లోని ఖామిస్ ముషైత్ రాష్ట్రంలోని అసీర్ ఏరియా లో జరిగింది. ఇప్పటికే హంతకుడు రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. జైలు లో ఉన్నపుడే అతినికి మరణి శిక్ష పడింది.

 

క్షమాభిక్ష తో   గొప్ప మానవత్వం ప్రదర్శించినందుకు తండ్రిని కీర్తిస్తూ  ప్రజలు భుజాలమీదికెత్తుకోవడం వీడియోలో చూడవచ్చు..

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !