డ్రంక్ అండ్ డ్రైవ్ లో దూసుకెళ్తున్న విశాఖ

Published : Aug 19, 2017, 05:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దూసుకెళ్తున్న విశాఖ

సారాంశం

ఈ కేసులో 293మందికి జైలు శిక్ష విధించగా.. ఇంకా 2,293 కేసులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అమ్మాయిలు కూడా పట్టుబుడుతున్నారని అధికారులు చెబుతున్నారు

 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో విశాఖపట్నం దూసుకెళుతోంది. గత నాలుగేళ్లలో కొన్ని వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 13వేలకుపైగా కేసులను పోలీసులు నమోదు చేశారు. వాహన దారుల వద్ద నుంచి వసూలు చేసిన జరిమానా రూ.86.73లక్షలు గా ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ కేసులో 293మందికి జైలు శిక్ష విధించగా.. ఇంకా 2,293 కేసులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏలా పెరిగిపోతున్నాయంటే.. 2013 నుంచి 2016 సంవత్సరాల కాలంలో 283మందికి జైలు శిక్ష విధించగా... ఇటీవల కేవలం  ఏడు నెలల్లో 293 మంది ఈ కేసులో పట్టుబడి శిక్ష అనుభవించారు.

పోలీసులు కేసు నమోదు చేస్తున్నా.. కోర్టులు జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తూ.. వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. పైగా ఇంకా ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. వీరిలో ఎక్కవ మంది టీనేజర్లు ఉండటం గమనార్హం. సగటున రోజుకు 60 నుంచి 80 కేసులు నమోదౌతున్నాయి.

కాగా.. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అమ్మాయిలు కూడా పట్టుబుడుతున్నారని అధికారులు చెబుతున్నారు. కాకపోతే.. వారిపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని వారు చెప్పారు. మహిళా పోలీసు ఎన్ఫోర్సెమెంట్ టీంలు లేకపోవడంతో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మహిళలపై పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. స్టార్ హోటల్లు, పబ్ లలో రాత్రిపూట మద్యం సేవించి చాలా మంది మహిళలు నడుపుతున్నారని.. కేవలం మహిళా పోలీసులు లేరనే ఒక్క కారణం చేత వారిని వదిలిపెట్టాల్సి వస్తోందని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !