పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలా..? ఈ ఫుడ్స్ తినండి

First Published Mar 6, 2018, 5:31 PM IST
Highlights
  • పరీక్షల సీజన్ మొదలైంది. పరీక్షలు అనగానే.. విద్యార్థుల్లో ఎక్కడలేని టెన్షన్ వచ్చి పడుతుంది.

పరీక్షల సీజన్ మొదలైంది. పరీక్షలు అనగానే.. విద్యార్థుల్లో ఎక్కడలేని టెన్షన్ వచ్చి పడుతుంది. తిండి, నిద్ర మానేసి మరీ చదివేస్తుంటారు.అయితే.. సరైన ఆహారం తీసుకోవడం వల్ల.. విద్యార్థులు పరీక్షల్లో రాణించగలరు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో.. వాటివల్ల కలిగే ఉపయోగాలేంటో ఒకసారి చూసేద్దామా...

షుగర్, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉండే వాటికి ఎంత దూరంగా ఉంటే విద్యార్థులకు పరీక్షల కాలంలో అంత మంచిది. యాంటి ఆక్సిటెంట్లు ఎక్కువగా ఉండే గుడ్లు, క్యారెట్లు, బ్రకోలి, జీడిపప్పు, బాదాం, చేపలు, ఆకు కూరలు, కూరగాయాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉంటే ఏ, సీ, ఈ విటమిన్లు ఒత్తిడి తగ్గిస్తాయి. దీంతో.. మెదడు ప్రశాంతంగా ఉండి.. చదివినవి ఎక్కువసేపు గుర్తుంటాయి.

వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. ఎండాకాలం కాబట్టి శరీరం త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి ఎంత ఎక్కువ మంచినీరు తాగితే అంత మంచిది. నీరు తాగకపోతే.. నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఇవి మెదడు చురుకుతనాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. ఉదయం పూట బ్రేక్ పాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు.  అదేవిధంగా మరీ కడుపు నిండా కాకుండా.. కాస్త పొట్టలో ఖాళీ ఉండేలా భోజనం తీసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే.. పరీక్షల టెన్షన్ ని కాస్త తగ్గించుకోవచ్చు.
 


 

click me!