తెలుగోళ్లు కర్నాటకను ఆదర్శంగా తీసుకుంటారా?

First Published Dec 23, 2016, 6:22 AM IST
Highlights

ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే పరిశ్రమలు బ్లూకాలర్ ఉద్యోగాలు స్థానికులకే  ఇవ్వాలంటున్న కర్నాటక

 విపరీతంగా పెట్టుబడులొస్తున్నాయి, ఇక రాయలసీమకు ఉద్యోగాలే ఉద్యోగాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినపుడు  రాయలసీమ వాళ్లకు అనుమానం వచ్చింది.  బయటి కంపెనీలు ఆ ప్రాంతంలో  పెట్టిన  సిమెంట్  ఫ్యాక్టరీలలో  స్థానికులకు ఉద్యోగాలు వచ్చింది నామమాత్రమే.   చివరకు వాచ్ మన్ లనుకూడా నార్త్ ఇండియాను తెచ్చుకున్నారని చెప్పారు.  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా మర్శించారు.

 

 నీళ్లు మనవి, భూములు మనవి, కరెంటు మనది, పరిశ్రమలకిచ్చే రాయితీలు మనవి, రుణాలు మనవి. మరి, రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనమేమిటి? ఉద్యోగాలే కదా ప్రయోజనం.  ఏ  ప్రాంతంలో పరిశ్రమ లు పెట్టిన ఆ ప్రాంతం వారికి ఉద్యోగాలు రాకపోతే, అభివృద్ది ఎలా అవుతుంది,అనేది స్థానికుల ప్రశ్న.

 

దీనికి  ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఇంకా ఒక  చట్టం తీసుకు రావలసి ఉంది.

 

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంలో ఆంధ్ర, తెలంగాణా కంటే చాలా ముందున్నారు.

 

సాఫ్ట్ వేర్, బయోటెక్ రంగాలలో తప్ప, ఇతర పరిశ్రమలన్నంటిలో బ్లూ కాలర్ ఉద్యోగాలు (అంటే స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులు)  నూటికి నూరు శాతం కన్నడిగులకే ఇవ్వాలి. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఇవేవీ పెద్ద ఉద్యోగాలుకాదు.  చిన్న చిన్న ఉద్యోగాలే. ఇవి కూడా స్థానికులకు దక్కక పోతే ఎలా? ప్రయివేటు కంపెనీలు బ్లూకాలర్ ఉద్యోగాలు నూరు శాతం కన్నడిగులకే ఇవ్వాలన్న నియమాన్ని వాళ్లిపుడు ఇండస్ట్రియల్ పాలసీ లో పొందుపర్చారు. ఈ నియమం పాటించక పోతే, ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు రద్దయిపోతాయి.కర్నాటక ఇండస్ట్రియల్  ఎంప్లాయ్ మెంట్ (స్టాండింగ్ అర్డర్స్) రూల్స్ ,1961 సవరణచేస్తూ కార్మిక శాఖఇపుడు ఉత్తర్వుల జారీ చేసింది.

 

ప్రభుత్వం నుంచి  నీరు,భూములు, బ్యాంకుల నుంచి రుణాలు, విద్యుత్తు తీసుకున్న ప్రతి కంపెనీకి 100 కన్నడిగులకే ఉద్యోగాలనే నియమం వర్తిస్తుంది.  బ్లూ కాలర్ ఉద్యోగాలు లేని  ఇన్ఫోటెక్, బయోటెక్ కంపెనీలను ఈ నియమం నుంచి మినహా ఇంపు ఇచ్చారు. అయితే, కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామదాస్ అథవలే మాత్రం 100 శాతం కాకుండా 80 శాతం తీసుకుని 20 శాతం బయట వారికి కేటాయించండని సలహా ఇచ్చారు.

 

ఏమయినా సరే ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు కూడా తొందరగా ఒక నిర్ణయం తీసుకోవాలి.

 

click me!