పిల్లల్లో ఐక్యూ పెంచే ఫుడ్స్ ఇవే..

First Published Dec 23, 2017, 2:30 PM IST
Highlights
  • పిల్లలు కనుక వారానికి ఒకసారి చేపలను తింటే.. వారి ఐక్యూ లెవల్స్ 4 పాయింట్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మీ పిల్లలు.. అందరికన్నా తెలివిగా ఉండాలా? ప్రతి విషయాన్ని చక్కగా గుర్తుంచుకోవాలనుకుంటున్నారా? చదువుల్లో, ఆటల్లో అందికన్నా ముందుండాలనుకుంటున్నారా? అయితే.. కచ్చితంగా మీ పిల్లలకు చేపలు తినిపించాలంటున్నారు పరిశోధకులు. కనీసం వారానికి ఒకసారి చేపలను పిల్లలకు ఆహారంగా పెడితే.. వారి మెంటల్ స్కిల్స్ మెరుగుపడతాయంటున్నారు నిపుణులు. పిల్లలు కనుక వారానికి ఒకసారి చేపలను తింటే.. వారి ఐక్యూ లెవల్స్ 4 పాయింట్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ..బ్రెయిన్ ఎదుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా 9నుంచి 11ఏళ్ల పిల్లలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లల్లో పెద్దవారిలో నిద్రలేమి సమస్య కూడా ఉండదని చెబుతున్నారు నిపుణులు. చేపలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రోపోగలరు. ఇందులో ఉండే విటమిన్ డీ అందుకు సహాయపడుతుంది. కళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి కూడా చేపలు బాగా పనిచేస్తాయి. చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సహాయపడతాయంటున్నారు నిపుణులు. పెద్దవారిలో హార్ట్ ఎటాక్ సమస్యలను రాకుండా ఉండేందుకు కూడా ఇవి దోహదం చేస్తాయి.

click me!