
ఈ రోజు ముద్రగడ పద్మనాభం.. కిర్లంపూడి- అమరావతి యాత్రలో పాల్గొనకుండా తూ. గోదావరి జిల్లా మొత్తం పోలీసులు నిర్భంధం విధించారు. మహిళను కూడా దౌర్జన్యంగా అడ్డుకున్నారు. కాపులను బిసిలో జాబితాలో చేర్చుతానని 2014 ఎన్నికలపుడు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అమలుచేయనందుకు నిరసనగా ఆయన అమరావతి దాకా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అది ఈ రోజు జరుగవలసి ఉంది.అయితే, యాత్రకు అనుమతి లేదని పోలీసులు పోద్దనే ఆయనను కిర్లంపూడిలో హౌస్ అరెస్టు చేశారు. నిరసనకు తరలి వస్తున్న మహిళలను సైతం వారు వదిలిపెట్టలేదు. వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు.