భూదాహం: కెకె లాగా మొత్తబడుతున్న డిఎస్?

Published : Jun 15, 2017, 07:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
భూదాహం: కెకె  లాగా మొత్తబడుతున్న డిఎస్?

సారాంశం

ప్రస్తుతం టిఆర్ ఎస్  రాజ్యసభ సభ్యుడయిన డిఎస్ కూడా భూవివాదంలో చిక్కుకున్నారు. ఈ పెద్దమనిషి అసైన్డు భూములు కొన్ని చట్టాన్నిఉల్లఘించి, పలుకుబడి ఉపయోగించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారన్నది ఆరోపణ. ఇది ఎలాగ బయటపడింది?  ప్రభుత్వమే ఈ విషయాన్ని లీక్ చేసిందనే వార్తలు కూడ వినబడుతున్నాయి. అందుకని, రుజువు చేస్తే వాపసు ఇస్తానని చల్లగా చెప్పారు.

డిఎస్ గా జగమెరిగిన డి శ్రీనివాస్ మెల్లిగా  కోలీగ్ కెకె బాటపడుతున్నాడు.

 

ప్రస్తుతం టిఆర్ ఎస్  రాజ్యసభ సభ్యుడయిన డిఎస్ కూడా భూవివాదంలో చిక్కుకున్నారు. ఈ పెద్దమనిషి అసైన్డు భూములు కొన్ని చట్టాన్నిఉల్లఘించి, పలుకుబడి ఉపయోగించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అయినా ఈ విషయం బయటపడింది. ప్రభుత్వమే ఈ విషయాన్ని లీక్ చేస్తున్నదనే వార్తలు కూడ వినబడుతున్నాయి.

 

ఇపుడాయన తాను కొనుగోలుచేసిన భూముల మీద వస్తున్న వివాదం గురించి స్పందించారు. తాను కొన్నది అసైన్డ్ భూమని తేలితే తిరిగి ఇచ్చేస్తానని డీఎస్ చెప్పారు.

 

తాను కొనుగోలు చేసింది ప్రభుత్వ భూమి కానే కాదని  వాదిస్తూనే ఇలా మొత్త బడ్డారు.

 

1960 రికార్డులు పరిశీలించే భూము కొన్నాను. చట్టబద్దత ఏమిటో పరిశీలించాకే భూమిని కొన్నాను. ఈ భూమికి  1960 నుంచి రికార్డులు ఉన్నాయి.  అది అసైన్డ్ ల్యాండ్ అనడం హాస్యాస్పదంగా ఉంది. అసైన్డ్ భూమి అయినట్లయితే నాలుగు సార్లు రిజస్ట్రేషన్లు ఎలా జరిగాయి. అయినా సరే, అసైన్డు భూమి అని తేలితే, ప్రభుత్వానికి ఇచ్చేస్తా,’ నని ఆయన చెప్పారు. 

 

కెకె డిఎస్ ల మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరు కాంగ్రెస్ లో ఉండి, చాలా పైకొచ్చి  , కాంగ్రె్స్ కష్ట కాలంలో ఉన్నపుడు బంగారు తెలంగాణా నిర్మాణం కోసమని టిఆర్ ఎస్ లో చేరారు.ఇద్దరు పిసిసి అద్యక్షులుగా ఉన్నారు.  టిఆర్ ఎస్  లో చేరాక ఇద్దరు రాజ్యసభ సభ్యులయ్యారు. ఇద్దరు భూవివాదాల్లో చిక్కుకున్నారు. ఇపుడు ఇద్దరు మొత్తబడి భూములు వాపసు ఇస్తామంటున్నారు.ఇద్దరు మున్నూరు కాపు నాయకులే.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !