
రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబూలో ఒక తాగుబోతు డ్రైవర్ భీభత్సం సృష్టించాడు. పట్టపగలే మందు ఫుల్ గా లాగించాడు. మత్తులో ఏంచే స్తున్నాడో తెలియడం లేదు. ఒక మార్కెట్ ప్రాంతంలో ప్యాసింజర్ మారుతీ వ్యానుతో ప్రవేశించాడు. ఇష్ట మొచ్చినట్టు నడిపాడు. ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీ కొట్టాడు.అంతేకాదు, ఆగకుండా స్కూటర్ ముందువైపు ఇరుక్కున్నా దూసుకుపోయాడు. స్కూటర్ మీద భార్యభర్తలు ఉన్నారు. ఈ మధ్య లో వ్యాన్ టైర్ భార్య కింది చక్రానికి బంపర్ కి మధ్య ఇరుక్కుపోయింది. అయినా ఆగలేదు. నిషాలో ఏంజరగుతున్నదో గమనించే స్థితిలో లేడు. అలాగే నడపుకుంటూ వెళ్తున్నాడు. ఆ మహిళను కూడా వ్యానుతో పాటు సుమారు 50 మీటర్ల దూరం లాక్కునిపోయాడు. అపుడు ఒక కూడలి వద్ద ఈ భయానక దృశ్యం ప్రజలకంట బడింది.పరిగెత్తుకుంటూ వెళ్లి, వ్యాన్ ను నిలిపి డ్రైవర్ ను నాలుగు తన్ని కిందికి లాగారు. తర్వాత పోలీసులకు అప్పచెప్పారు. వీడియో చూడండి.