
కృష్ణా జిల్లా కొండూరు మండలం కోడూరు గ్రామంలో కుక్కలను చంపి ఆ మాంసాన్ని అడవి జంతువుల మాంసం గా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ది చేశారు. కుక్కల మాంసాన్ని కిలో రూ.400కి మైలవరం రెస్టారెంట్లలో అమ్ముతున్నట్లు నింధితులు ఒప్పుకున్నారు.
గత కొన్ని రోజులుగా గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిపై అనుమానం వచ్చి గ్రామస్తులు వీరిపై నిఘా పెట్టారు. వారు గ్రామంలోని కుక్కను ఈడ్చుకెళ్లి తల నరికి చర్మం తీస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని గ్రామస్తులు గట్టిగా ప్రశ్నించగా నిందితులు ఈ మాంసాన్ని అడవి జంతువుల మాంసం పేరుతో మైలవరం రెస్టారెంట్లలో అమ్ముతున్నట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు నిందితులు కట్టా ఆదినారాయణ, సేగు లక్ష్మణరావు లను దేహశుద్ది చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటా వారిపై పోలీసులు, ప్రభుత్వ ం కూడా గట్టి నిఘా పెట్టాలని గ్రామస్తులు సూచిస్తున్నారు.