డయాబెటీస్ ఉన్నవాళ్లు బెల్లం తినవచ్చా?

First Published Dec 11, 2017, 5:54 PM IST
Highlights
  • నిజానికి పంచదార కన్నా దాని స్థానంలో బెల్లం తీసుకోవడం ఉత్తమం.
  • బెల్లం వల్ల మనకు తెలియని చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

సాధారణంగా ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలంటే చాలా మంది పంచదార ప్రిఫర్ చేస్తారు. కానీ నిజానికి పంచదార కన్నా దాని స్థానంలో బెల్లం తీసుకోవడం ఉత్తమం. బెల్లం వల్ల మనకు తెలియని చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం

1. బెల్లం తరచూ తీసుకోవడం వల్ల ఆస్తమా లాంటి శ్వాసకోస సంబంధ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.

2.అంతేకాదు.. ఉపిరితిత్తులు,గొంతు ఇన్ ఫెక్షన్ ల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

3.ఎముకలు,కండరాలు బలంగా తయారవ్వడానికి బెల్లం సహాయపడుతుంది.

4. ప్రతి రోజూ ఉదయం పూట గోరువెచ్చని పాలలో కొంత బెల్లం వేసుకొని తాగితే ఎముకలు బలంగా మారతాయి.

5. బెల్లం, అల్లం కలిపి తీసుకుంటే జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ వస్తుంది.

6. తీపి తింటే జలుబు, దగ్గు ఎక్కువ అవుతాయి అని అందరూ భావిస్తుంటారు. కానీ జలుబు, దగ్గు తగ్గడానికి బెల్లం మాత్రం చాలా సహాయపడుతుంది. అందులో ఉండే అలర్జిక్ నేచర్ వాటిపై పోరాటం చేస్తాయి.

7.వేడి నీటితో కలిపి లేదా టీలో పంచదారకు బదులు బెల్లం తీసుకున్నా.. ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

8. మూత్ర సంబంధ వ్యాధితో బాధపడుతున్నవారికి బెల్లం చక్కటి పరిష్కారం.

9. బెల్లంతో బటర్, ఇండియన్ గూస్ బెర్రీ పౌడర్ కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధికి చెక్ చెప్పవచ్చు.

10. ప్రతి రోజూ భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే పేగు సంబంధిత వ్యాధుల నుంచి ఉపసమనం పొందవచ్చు. ఆహారం కూడా త్వరగా అరగడానికి బెల్లం ఉపయోగపడుతుంది.

11. బరువు తగ్గడానికి కూడా బెల్లం సహాయపడుతుంది.  

12. కారణం.. బెల్లంలో జింక్, పొటాషియం, ఐరన్ లాంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇది నెర్వస్ సిస్టమ్ మెరుగుపడటానికి ఎంతో దోహదం చేస్తుంది.

13.బెల్లంతో బటర్ కలిపి తీసుకుంటే చెవి నొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంది.

14. ఆరోగ్యం మాత్రమే కాదు.. అందానికి కూడా బెల్లం బాగా హెల్ప్ చేస్తుంది. జుట్టుపెరగడానికి, ముఖంపై పింపుల్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఇంత చెప్పుకున్నాక, బెల్లం గురించిన  మరొక భ్రమ గురించి చెప్పుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు బెల్లం తినవచ్చా అనేది.ఇది కేవలం అపోహ మాత్రమే. బెల్లంకు ఎన్ని ప్రయోజనాలున్నా అధి కూడా సూక్రోజ్ నుంచి వచ్చిందే. బెల్లం లో  కూడా సూక్రోజ్ లాంగ్ ఫామ్ లో నే ఉంటుంది. అందువల్ల బెల్లం తినడం ఏ మాత్రం సేఫ్ కాదు. ఇది గుర్తుంచుకోవాలి.

click me!