కొబ్బరి నూనెతో బెల్లీ ఫ్యాట్ కి చెక్

First Published Dec 11, 2017, 4:42 PM IST
Highlights
  • భారతీయ వైద్య వ్యవస్థ అయిన ఆయుర్వేదంలో కొబ్బరినూనెకున్న స్థానం ప్రత్యేకమైనది.
  • ఆయుర్వేదంలో కొబ్బరినూనెను అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడానికి వాడతారు.

బెల్లీ ఫ్యాట్.. చాలా మందికి ఇదో పెద్ద సమస్య. మారుతున్న ఆహారపు అలవాట్లు.. సరైన వ్యాయామం లాంటివి లేక పొట్టచుట్టూ కొవ్వు పెరిగిపోతుంటుంది. అది రోజు రోజుకీ పెరిగి సమస్య తీవ్రతరం అవుతుంది. దానిని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కానీ.. కొబ్బరి నూనె ఉపయోగించి బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చని చెబుతున్నారు నిపుణులు. మీరు చదవింది నిజమేనండి. జట్టు సంరక్షణ కోసం ఉపయోగించే కొబ్బరి నూనెతో బెల్లిఫ్యాట్ ని కరిగించవచ్చు.

ఇండియా వంటి దేశాలలో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటలలో వాడతారు. ఈ విషయం అందరికీ తెలిసినదే. వంట ప్రయోజనాలతో పాటు కొబ్బరి నూనెను చర్మ సౌందర్యానికి అలాగే శిరోజాల సంరక్షణకు వాడతారు. అందుకే దీనిని సహజసిద్ధమైన బ్యూటీ ప్రోడక్ట్ గా పేర్కొంటారు. అంతే కాకుండా, భారతీయ వైద్య వ్యవస్థ అయిన ఆయుర్వేదంలో కొబ్బరినూనెకున్న స్థానం ప్రత్యేకమైనది. ఆయుర్వేదంలో కొబ్బరినూనెను అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడానికి వాడతారు. సోరియాసిస్, అధిక కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల వంటి వాటిని నయం చేయడానికి కొబ్బరినూనె ఉపయోగపడుతుంది. కాబట్టి, కొబ్బరినూనెలో అనేకరకాలైన ఆరోగ్యప్రయోజనాలున్నాయన్న విషయం స్పష్టమైంది.

ఇటీవలి పరిశోధన అధ్యయనం ప్రకారం కొబ్బరి నూనెను ప్రతి రోజూ పొట్ట చుట్టూ దాదాపు 30 నిమిషాల వరకు రబ్ చేయడం ద్వారా పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వును కరిగించవచ్చని తెలుస్తోంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరినూనె , పొట్టలోని చర్మరంధ్రాల ద్వారా చర్మంలోకి ఇంకిపోయి ఫ్యాట్ లేయర్స్ లో ప్రవేశించి ఫ్యాట్ సెల్స్ ను చాలా వేగవంతంగా కరిగిస్తుంది. అయితే, కేవలం కొబ్బరినూనెను పొట్టపై రబ్ చేయడం ద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలని ఆశించవద్దు. కొబ్బరినూనె చిట్కాతో పాటు మీరు ఆహారనియమాలను పాటించాలి. తగిన వ్యాయామం చేయాలి. వీటి కాంబినేషన్లో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం సాధ్యపడుతుంది. ప్రతిరోజూ కనీసం గంటపాటు వ్యాయామం చేయాలి. కార్డియో మరియు అబ్డోమినల్ వ్యాయామంపై దృష్టి పెట్టాలి. కొవ్వు పదార్థాలు తక్కువగా కలిగిన ఆహారపదార్థాలను అలాగే ప్రోటీన్ తో పాటు ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

కొబ్బరినూనెను పొట్టపై అప్లై చేసే విధానం: 3 లేదా 4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను వేడి చేయాలి. ఈ నూనెను మీ పొట్టపై మృదువుగా అప్లై చేయండి. దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు కొబ్బరినూనెతో మీ పొట్టను మసాజ్ చేయండి. కనీసం మూడువారాలపాటు ప్రతిరోజూ ఈ పద్దతిని పాటిస్తే మీకు ఆశించిన ఫలితాలు అందుతాయి.
 

click me!