
సచిన్ టెండూల్కర్...
భారత్ క్రికెట్ కు ఓ పర్యాయ పదం...
మాస్టర్ బ్లాస్టర్ గా మైదానంలోనే కాదు బయట కూడా ఎవరెస్టు అంత పేరు తెచ్చుకున్నాడు.
క్రికెట్ లో ఉన్న దాదాపు అన్ని రికార్డులను తిరగరాశాడు. సుదీర్ఘ కాలం క్రికెటర్ గా రాణించాడు.
దశాబ్ధాల పాటు సాగిన సచిన్ క్రీడా జీవితంలోని చాలా విశేషాలు ఆయన అభిమానులకు కొట్టిన పండి.
మాస్టర్ ఆడిన తొలి మ్యాచ్, తొలి సెంచరీ, ఫస్టు సిక్సర్ అన్నీ చాలా మందికి తెలిసే ఉంటాయి.
అయితే సచిన్ వాడిన మొదటి బ్యాట్ గురించి తెలుసా... ?
ఆయనకు ఇంతకీ ఆ బ్యాట్ ఎవరిచ్చారు…?
ఇదంతా తెలియాలంటే ముంబై నుంచి కశ్మీర్ వరకు వెళ్లాల్సిందే.
సచిన్ ను క్రికెట్ ను పరిచయం చేసింది ఆయన అన్నయ్య అని చాలా మందికి తెలిసిందే. అయితే సచిన్ కు ఫస్టు బ్యాట్ కొనిచ్చింది మాత్రం ఆయన కాదట.
సచిన్ సోదరి సవిత కశ్మర్ నుంచి ప్రత్యేకంగా ఓ బ్యాట్ తీసుకొచ్చి మాస్టర్ బ్లాస్టర్ కి ఇచ్చారట. అదే సచిన్ మొదటి బ్యాట్.
ఈ బ్యాట్ కథ గురించి మరింత బాగా తెలుసుకోవాలంటే మే 26 వరకు ఆగాల్సిందే.
ఆ రోజే సచిన్ జీవిత చరిత్రతతో తెరకెక్కిన సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా విడుదలవుతోంది.