
బంగారం కోనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధర వరుసగా నాలుగో రోజు కూడా తగ్గింది. అదే బాటలో వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది.
ఈ రోజు పది గ్రాముల బంగారం ధర రూ. 28, 880 కి చేరింది. నిన్నటితో పోల్చితే రూ. 270 తగ్గింది.
అంటే ఆరు వారాల కనిష్టానికి బంగారం ధర చేరుకుందన్నమాట. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ తగ్గడం వల్లే ధర తగ్గినట్లుగా బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదే బాట లో వెండి ధర కూడా తగ్గుముఖం పడుతోంది. ఈ ఒక్క రోజు వెండి ధర కేజీకి రూ.650 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39000 గా నమోదైంది.