హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Published : Jun 16, 2017, 03:14 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బండారు  పల్లి కోమలి (30) గురువారం  ఆత్మహత్య చేసుకుంది.తాను డిప్రెషన్ వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, దీనికి ఎవరూ బాధ్యులు కారని  ఆమె ఒక లేఖలో తెలిపింది.

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బండారు  పల్లి కోమలి (30) గురువారం  ఆత్మహత్య చేసుకుంది.

గుంటూరు కు చెందిన కోమలికి అయిదేళ్ల కిందట భాస్కర్ రావు అనే మరొక సాఫ్ట్ వేర్ ఉద్యోగితో వివాహమయింది. వారు  కూకట్ పల్లి ఫేజ్ 3 కాలనీలో ఒక ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. గురువారం  రాత్రి ఎనిమిది గంటలకు భాస్కర్రావు ఆఫీసు నుంచి  ఇంటికొచ్చాడు. అయితే, బెడ్ రూం తలుపు లోపలినుంచి గడియ పెట్టి ఉండటం చూశాడు. తర్వాత ఇరుగుపొరుగు వారితో కలసి తలుపు పగులకొట్టి కి లోనికి ప్రవేశించారు. అయితే, బెడ్ రూంలో సీలింగ్ కు వురి వేసుకుని ఉంది. ఈ విషయాన్ని వెంటనే ఆయన కోమలి తల్లితండ్రులకు తెలియచేశాడు.

బెడ్ రూంలో పోలీసులకు  ఒక ఆత్మహత్య లేఖ దొరింది. తాను డిప్రెషన్ వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, దీనికి ఎవరూ బాధ్యులు కారని  ఆమె లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !