రు.20 వేల కోట్ల విలువైన భూములు కాజేశారు,కాస్త చూడండి సార్!

First Published Jun 16, 2017, 2:22 PM IST
Highlights

విశాఖ పట్టణం చుట్టూ పది మండలాలలో  లక్ష ఎకరాల భూముల రికార్డులు మాయమమయ్యాయి. భూ కబ్జాల విలువల రు. 20వేల కోట్లని చెబుతున్నారు.  తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కుమ్మక్కయి భూములు కాజేసినట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు.   ఈ వివరాలన్నీ దృష్టిలో పెట్టుకుని  గవర్నర్ సిబిఐ విచారణ కు సిఫా ర్స్  చేయాలి

విశాఖ పట్టణం చుట్టూ పది మండలాలలో  లక్ష ఎరాలను తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కాజేసినట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పిన విషయాన్ని ఉత్తరాంధ్ర నాయకుడు కొణతాల రామకృష్ణ గవర్నర్ దృష్టి కి తీసుకువెళ్లారు. మాజీ మంత్రి కూడా అయిన రామకృష్ణ చాలా స్పష్టమయిన వివరాలను గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ ముందుంచి సిబిఐ విచారణ వేయించాలనికోరారు.

రామకృష్ణ ఏదో గాలి కబుర్లు గవర్నర్ ముందుంచలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించిన విషయాలనే ఒక లేఖ ద్వారా గవర్నర్ దృష్టి కి తెచ్చారు.

లేఖలో రామకృష్ణ పేర్కొన్న వివరాలు:

1.ఇటీవల నవనిర్మాణ దీక్ష చేస్తూన్న వేదిక మీది నుంచి క్యాబినెట్ మంత్రి అయ్యన్న పాత్రుడు ‘‘ క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర నేతలు రియల్ ఎస్టేట్ సంస్థలతో  కుమ్మక్కయి భూములు కబ్జా చేశారని అన్నారు.

2. తర్వాత విశాఖ పట్నం కలెక్టర్ ఒక విలేకరుల సమావేశంలో భూముల రికార్డులను తారుమారుచేశారని చెప్పారు. దాదాపు లక్ష ఎకరాలకు ఎప్ ఎం బి పుస్తకాలు మాయమయ్యాయని, 233 గ్రామాలలో భూముల  రికార్డు గల్లంతయ్యాయయని అన్నారు. ఇపుడేమో అబ్బే మోతాదులో లేదు వ్యవహారం, రికార్డుల తారుమారు కావడం అనేది కొన్ని వందల ఎకరాల్లో మాత్రమే జరిగిందని అంటున్నారు, కారణం అర్థం చేసుకోవచ్చు.

3. మధురవాడలో రు.3100 కోట్ల విలువయిన భూములను, కొమ్మాడిలో రు.1600 కోట్ల విలువయిన భూములను కాజేశారు.

4. హుద్ హుద్ తుఫానులో ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి.  దీనితో రికార్డులను మాయంచేసేందుకు తెలుగుదేశం నేతలకు సువర్ణావకాశమయింది.

5. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమయిన భారతీయ జనతా పార్టీ కూడా భూ కుంభకోణం అని విమర్శిస్తూ ఉంది.

6. దీని మీద జూన్ 15న ఉప ముఖ్యమంత్రి  పబ్లిక్ హియరింగ్ చేపడతానన్నారు. తీరా ఇపుడు దీనిని రద్దు చేసి సిట్ ఏర్పాటు చేశారు.

 

ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తున్నందున, ఒక్క సిబిఐ విచారణ తప్పమరొక విచారణ లో న్యాయం వెలుగులోకి రాదని చెబుతూ విశాఖ భూ కబ్జాల మీద సిబిఐ విచారణకు సిఫార్సు చేయాలని  రామకృష్ణ గవర్నర్ ను కోరారు.

click me!