ఆ సామ్ సంగ్ ఫోన్లు ఎందుకు రావడం లేదు!

Published : Mar 07, 2017, 01:57 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఆ సామ్ సంగ్ ఫోన్లు ఎందుకు రావడం లేదు!

సారాంశం

ఎస్7 పేరుతో సామ్ సంగ్ మార్కెట్ లోకి విడుదల చేసిన ఫోన్లను కొన్ని రోజులకే వెనక్కి తీసుకుంది. ఇప్పుడు దాని స్థానంలోనే ఎస్ 8 సిరీస్ ఫోన్లు వస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్ ల అమ్మకాలలో సామ్ సంగ్ కు తిరిగేలేదు. దాదాపు 70 శాతం స్మార్ట్ ఫోన్ అమ్మకాల వాటా ఈ కంపెనీదే.

 

కొత్త ఫీచర్లతో యూత్ ను కూడా ఆకట్టుకోవడంలో ఈ మొబైల్ దిగ్గజం ఎప్పుడూ ముందే ఉంటుంది. మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో త్వరలో మార్కెట్ లోకి ఎస్ 8, ఎస్ 8 ప్లస్ ఫోన్ లను విడుదల చేయనున్నట్లు ప్రకటిచింది.

 

దీంతో సామ్ సంగ్ ఫ్యాన్స్ అంతా ఈ కొత్త ఫోన్ లకోసం తెగ వెయిట్ చేస్తున్నారు.  అయితే వీటి విడుదలపై అప్పుడు అనుమానాలు మొదలయ్యాయి.

 

గతంలో ఎస్7 పేరుతో సామ్ సంగ్ మార్కెట్ లోకి విడుదల చేసిన కొన్ని రోజులకే దాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు దాని స్థానంలోనే ఎస్ 8 సిరీస్ ఫోన్లు వస్తున్నాయి.

 

మొదటి ఈ కొత్త ఫోన్ ను మార్చి 29 నే విడుదల చేయాలని యాజమాన్యం నిర్ణయించిందట  కానీ, ఇప్పుడు ఆ రోజు విడుదల కష్టమేనని వార్తలు వస్తున్నాయి. మరోవైపు విడుదల తేదీని మార్చడానికి కారణాలేంటో బయటకి రావడం లేదు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !