కదులుతున్న రైలుపై సైకిల్ రైడింగ్...(వీడియో)

Published : Jul 25, 2017, 05:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కదులుతున్న రైలుపై సైకిల్ రైడింగ్...(వీడియో)

సారాంశం

కదిలే రైలుపై సైకిల్ తొక్కేందుకు ప్రయత్నం తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు.

మీరు సైకిల్ ఎక్కడ నడుపుతారు..? అందరిలాగానే నేల మీద( తారు రోడ్డు, మట్టిరోడ్డు) నడుపుతారు కదా..ఎప్పుడైనా కదిలే రైలు మీద నడిపే ప్రయత్నం చేశారా.. అలా కూడా ఎవరైనా చేస్తారా అని  అనుకుంటున్నారా.. రష్యాలో ఇద్దరు యువకులు  అలానే చేశారు. ప్రమాదపు అంచుల మీద వాళ్లు చేసిన సాహసం వివరాలు  ఇలా ఉన్నాయి.

రష్యాకి చెందిన ఇద్దరు యువకులు కొత్తగా ఏదైనా చేయాలని భావించారు. అనుకున్నదే తడువుగా.. సైకిల్ తీసుకొని కదిలే రైలు ఎక్కారు. అనంతరం ఒకరు సైకిల్ రైడింగ్ చేసేందుకు ప్రయత్నించగా.. మరొకరు దానిని వీడియో తీశారు. ఇద్దరు యువకుల్లో ఒకరు సైకిల్ తొక్కేందుకు విఫలయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో రైలు మీద నుంచి కింద పడపోయి.. తృటిలో తప్పించుకున్నాడు. అంతేకాక.. పైన విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి.. పొరపాటున వాటికి తగిలినా వారు ప్రమాదంలో పడిపోయేవారు. వారు చేసిన ఈ సాహస వీడియోని మీరూ వీక్షించండి.. ఇది చూశాక మీరు మాత్రం ప్రయత్నించకండే.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !