దేశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది - సానియా మీర్జా

First Published Jul 25, 2017, 5:05 PM IST
Highlights
  • మహిళ క్రికేటర్ల పై ప్రశంసలు.
  • దేశంలో మహిళలందరిని ప్రోత్సహించాలని సూచన.

 

దేశంలో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త పెరుగ‌తుంద‌ని తెలిపింది టెన్నీస్ స్టార్ సానియా మిర్జా. హైదరాబాద్ లో త‌న‌ అకాడ‌మీలో నేడు వరల్డ్ టెన్నిస్ అసోషియేషన్ నిర్వహించే టోర్నమెంట్ ప్రమోషన్ ను నిర్వహించారు సానియా మీర్జా. సానియా తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేహా దుపియా కూడా పాల్గోన్నారు. 

సానియా మిర్జా అకాడ‌మీ పిల్ల‌ల‌ను ఉద్దేశించి టెన్నీసులో ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం మీడియానుతో మాట్లాడారు. మ‌హిళ‌ క్రికేట్ ఫైన‌ల్ మ్యాచ్ లో మ‌న టీం ఓడిపోవ‌డం కాస్తా నిరాశ‌కు గురిచేసింద‌ని, అయినా మ‌న వాళ్లు ఫైన‌ల్ కి  వెళ్ల‌డం చాలా గొప్ప‌విష‌యం అని ఆమె అన్నారు. గ‌తంలో కంటే ఇప్పుడు మ‌హిళ‌ల‌కు దేశంలో ప్రాధాన్య‌త పెరుగుతుందని ఆమె అన్నారు. ఇలాగే ప్రతి ఆటలో కూడా మహిళలు ముందుకు దూసుకెళ్తున్నార‌ని, త‌న అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది త‌న కోరికగా చెప్పుకొచ్చారు

 

త్వ‌ర‌లో మలేషియా లో జరిగే ప్రపంచ వరల్డ్ టెన్నిస్ టోర్నమెంట్ కి ఇక్కడి నుంచి కూడా క్రీడాకారులు పాల్గోంటార‌ని ఆమె తెలిపారు. మీడియాతో మాట్లాడిన త‌రువాత అక్క‌డి విద్యార్థులతో నేహా దుపియా, సానియా బాలీవుడ్ పాట‌ల‌కు డ్యాన్స్ చేశారు.
 

click me!