జన ధన్ ఖాతాల్లో రూ. 64 వేల కోట్లా ?

Published : Nov 26, 2016, 01:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
జన ధన్ ఖాతాల్లో రూ. 64 వేల కోట్లా ?

సారాంశం

ఇప్పటికి రూ. 64,252 కోట్లు జన్ ధన్ ఖాతాల్లో జమఅయ్యాయి.

ఏడాదికి పైగా ఒక్క రూపాయి కూడా లేని కోట్లాది ఖాతాల్లో కేవలం 18 రోజుల్లో వేల కోట్లు జమ అవుతున్నది. దేశవ్యాప్తంగా జన్ ధన్ ఖాతాల్లో జమ అవుతున్న వేల కోట్ల డబ్బు ఎక్కడి నుండి వస్తోందన్న విషయమై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.

 

ప్రభుత్వం చెప్పినట్లు నల్లధనం ఏమీ బయటకు రాకున్న జన్ ధన్ ఖాతాల రూపంలో జమ అవున్నట్లుగా పలువురు అనుమానిస్తున్నారు. మొత్తం ఖాతాల వివరాలను విశ్లేషిస్తే విషయం బయటకు వస్తుంది.

 

ఎందుకంటే, బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించినప్పటి నుండి మొన్నటి వరకూ ఒక్కరూపాయి కూడా లేని ఖాతాలు కొన్ని లక్షలున్నట్లు కేంద్రప్రభుత్వమే ఆ మధ్య ప్రకటించింది. అటువంటిది పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చిన వెంటనే సదరు ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బులు వచ్చి పడుతుంటం పట్ల పలువురు ఆశ్చర్యపోతున్నారు.

 

కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించిన ప్రకారం ఇప్పటికి రూ. 64,252 కోట్లు జన్ ధన్ ఖాతాల్లో జమఅయ్యాయి. 3.79 కోట్ల ఖాతాల్లో రూ. 10, 670 కోట్లతో ఉత్తరప్రదేశ్ అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి.

 

కాగా 25.58 కోట్ల జన్ ధన్ ఖాతల్లోమొన్నటి వరకూ ఒక్క రూపాయి కూడా జమ కాకపోవటం గమనార్హం. అటువంటిది ఇపుడు కోట్ల కొద్ది నోట్ల కట్టలు వచ్చి పడిపోతున్నాయి.

పశ్చిమబెంగాల్లో 2.44 కోట్ల ఖాతాల్లో రూ. 7826 కోట్లు, రాజస్ధాన్ లో 1.89 కోట్ల ఖాతాల్లో రూ.5,345 కోట్లు, బీహార్ లోని 2.62 కోట్ల ఖాతాల్లో రూ. 4,912 కోట్లు జమ అయినట్లు ఆర్ధికశాఖ పేర్కొన్నది. అయితే, ఇక్కడ మరో విశేషం ఏమిటంటే 5.98 కోట్ల ఖాతాల్లో నిల్వ ఇంకా సున్నాయే ఉండటం.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !