
ప్రయివేటు భూములను, ప్రభుత్వ భూములను , శిఖం, పోరంబోకు భూములను, కోట్ల విలువయిన భూములను తీసుకుని స్వర్ణ భారతి ట్రస్టు నిర్మాణాలు చేపడుతున్నారని సిపిఐ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ రోజు లేఖ రాసింది. సిపిఐకార్యదర్శి రామకృష్ణ ఈ రోజు స్వర్ణభారతి ట్రస్టు అక్రమాలను ఆధారాలతో బయటపెట్టారు. ట్రస్టు బాధితులను ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. ట్రస్టు ఒక క్విడ్ ప్రో క్వో వ్యవహారమని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తమ విమర్శలకు సమాధానం చెప్పాలని రామకృష్ణ ఆరోపించారు. ఈ వ్యవహారాల మీద విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సత్యనారాయణ అనే కాంట్రాక్టర్ ట్రస్టు తనని ఎలా మోసం చేసిందో వివరించారు.