అర్ధంకాని ఆర్బిఐ ధోరణి

First Published Jan 4, 2017, 9:01 AM IST
Highlights

రద్దైన పాత పెద్ద నోట్లను తీసుకోవటానికి నిరాకరిస్తోంది.

రిజర్వ్ బ్యాంకు ధోరణి అర్ధం కావటం లేదు. రద్దైన పాత నోట్లను తీసుకోవటానికి నిరాకరిస్తున్నది. దాంతో జనాలందరూ ఆర్బిఐ అధికారులతో గొడవపడాల్సి వస్తోంది. నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసినపుడు పాత నోట్లను మార్పిడి చేసుకోవటానికి డిసెంబర్ 30వరకూ బ్యాంకుల్లో అవకాశం ఉందన్నారు.

 

అలాగే, మార్చి 31వరకూ రిజర్వ్ బ్యాంకుల్లో మర్చుకోవచ్చని కూడా ఆర్బిఐ ఉన్నతాధికారులు పలుమార్లు ప్రకటించారు. దాంతో బ్యాంకులకు వెళ్ళి గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడలేని వాళ్లందరూ కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. డిసెంబర్ లో గడువు అయిపోయిన తర్వాత తీరిగ్గా రిజర్వ్ బ్యాంకుకు వెళ్లవచ్చులే అనుకున్న వారికి ఇపుడు ఆర్బిఐ ఘులక్ ఇస్తోంది.

 

రద్దైన పాత పెద్ద నోట్లను తీసుకోవటానికి నిరాకరిస్తోంది. కారణాలడిగితే చెప్పటం లేదు. పైగా నోట్ల మార్పిడికి ధక్షిణ చెన్నైలోని రీజనరల్ కార్యాలయానికి వెళ్లి మార్చుకోమంటూ ఉచిత సలహా ఇస్తోంది. దాంతో జనాలుల అధికారులపై మండిపడుతున్నారు.

 

అయినా ఆర్బిఐ లెక్క చేయటం లేదు. దాంతో తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను ఏమి చేసుకోవాలో అర్ధంకాక జనాల్లో బిపి పెరిగిపోతోంది.

 

 

click me!