నంద్యాలలో తెగ రెచ్చిపోతున్న హస్య నటుడు వేణుమాధవ్

Published : Aug 19, 2017, 10:23 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
నంద్యాలలో తెగ రెచ్చిపోతున్న హస్య నటుడు వేణుమాధవ్

సారాంశం

హస్యనటుడు వేణుమాధవ్ కు ఎమయిందో ఏమో ఈ రోజు నంద్యాల టిడిపి తరఫున ప్రచారం చేస్తూ వొళ్లు మర్చిపోయాడు. రాజకీయనాయకుడిలాగా జగన్ మీద వ్యక్తి గత ధూషణలకు పూనుకున్నాడు.

తెలుగు సినిమా హాస్యనటుడు వేణుమాధవ్ నంద్యాల ప్రచారంలో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొంటున్నాడు. బాగనే ఉంది. నంద్యాల తెగ అభివృద్ధి చెందుతూ ఉందని చెబుతున్నారు. అదీ తప్పు లేదు. అయితే,  ఈ రోజు అతగాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కనుండటంతో తెగరెచ్చిపోయాడు. తాను సినిమా నటుడిననే స్పృహ లేకుండా ప్రవర్తించాడు. ఏవేవో మాట్లాడాడు.  టీడీపీ అభ్యర్ది ని గెలిపించాలంటూ ఆయన చంద్రబాబు తో కలిసి నంద్యాల రోడ్ షోలో పాల్గొంటూ రాజకీయ నాయకుడిలాగా జగన్ పై తనకు మాలిన వ్యాఖ్యలు చేశాడు. జగన్ కు బుద్ది లేదని, ఓ బట్టేబాజ్ అంటూ నోరు పారేసుకున్నాడు.

మరిన్ని నంద్యాల విశేషాలు

**అభివృద్దిలో నంద్యాల దూసుకెళ్తున్నదని, చరిత్రలో నంద్యాల చిరస్థాయిగా నిలిచిపోనుందని రాష్ట ఎక్సైజ్ శాఖామంత్రి జవహార్ అన్నారు. టీడీపీ అభ్యర్ది భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన కూడా ధీమా వ్యక్తం చేశారు. అభివృద్దిని చూసి, చంద్రబాబు నాయుడి సమర్దతను చూసి ఓటెయ్యాలంటూ ఆయన నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. 

** బలిజలు చంద్రబాబు నాయుడి రుణం తీర్చుకోవాలని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామాంజనేయ  అన్నారు. బలిజల అభ్యున్నతి కోసం నిరంతరం ఆలోచించే చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు నంద్యాలలోని బలిజలకే ఇదే మంచి అవకాశమన్నారు.. 

**చంద్రబాబు నాయుడు డబ్బు మూటలతో నంద్యాల నడి రోడ్డుల్లో తిరుగుతూ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.. మూడున్నర ఏళ్లుగా గుర్తురాని నంద్యాల అభివృద్ది ఉపఎన్నికలు రావడంతో గుర్తొచ్చిందన్నారు.. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వైసీపీ గెలుపు తధ్యమన్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu