వినోదరాయనిపాలెం గురించి తెలుసా?

Published : Aug 22, 2017, 05:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
వినోదరాయనిపాలెం గురించి తెలుసా?

సారాంశం

రేపు ప్రకాశం పంతులు జయంతి

వినోదరాయుని పాలెం పేరు విన్నారా... ఇది ప్రకాశం జిల్లాలో ఉన్న చిన్నగ్రామం. కాకపోతే, ఇపుడు ఆవూర్లో జిల్లాపరిషత్ హైస్కూల్ ఉంది. ఒంగోలు పట్టణానికి 30 కిమీ దూరంలో ఉంటుంది. ఇంతేనా, ఈ వూరి గురించి... చాలా మందికి ఇంతే. ముఖ్యంగా ఈ తరానికి ఈ వూరి ప్రాముఖ్యం తెలియదు.

1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినపుడు ముఖ్యమంత్రిగా నియమితుడయిన టంగుటూరి ప్రకాశం పంతులు(ఆగస్టు23,1972- మే 20,1957) జన్మస్థానం ఈవూరు. అది ఈ వూరి విశేషం.ఇపుడా వూరు మళ్లొక సారి వార్త లకెక్కుతూ ఉంది. ఆంధ్రకేసరి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహావిష్కరణ ఆయన జన్మస్థలం ప్రకాశంజిల్లా వినోదరాయునిపాలెంలో బుధవారం జరగనున్నది. ప్రకాశంపంతులు జన్మదినాన్ని ప్రభుత్వం పండుగగా జరుపుకోవాలని రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో మంత్రి శిద్ధా రాఘవరావు, జిల్లాకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రకాశం పంతులు గారు పుట్టిన నేలపై రూ.కోటి వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రహదారులు, రూ. 10 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణం, పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్‌కు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవనంలో డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆంధ్రకేసరికి నివాళి అర్పిస్తారు. కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి మూడేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెసిఆర్ కోరిక మరీ అంత చిన్నదేనా ?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu